Movie News

తెలుగు గ‌డ్డ‌పై థియేట‌ర్ తెరుచుకుంది


క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతికి రెండు నెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు మూత ప‌డ‌టం మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లేటుగా థియేట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న ఆగింది. చివ‌ర‌గా వ‌కీల్ సాబ్‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. ఆ సినిమా ఓ మోస్త‌రుగా ఆడుతుండ‌గానే.. ఏప్రిల్ చివ‌రి వారంలో థియేట‌ర్లు మూత‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ర్ఫ్యూ, లాక్ డౌన్ అమ‌ల‌వ‌డంతో థియేట‌ర్ల‌ను మూత వేయ‌క త‌ప్ప‌లేదు. ఇక అప్ప‌ట్నుంచి వెండితెర‌లు వెల‌వెల‌బోతూ ఉన్నాయి.

తెలంగాణ‌లో లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడిప్పుడే థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఆగ‌స్టు లేదా ద‌స‌రాకు కానీ బిగ్ స్క్రీన్ల‌లో సినిమాల సంద‌డి మొద‌లు కాద‌నుకుంటున్నారు. ఏపీలో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. థియేట‌ర్ల‌పై ఎవ‌రికీ ప్ర‌స్తుతం ఆశ‌ల్లేవు.

ఐతే ఏపీలో ఇప్పుడు ఒక ప్ర‌ముఖ థియేట‌ర్ తెరుచుకుంటుండ‌టం, అక్క‌డ ఓ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు రంగం సిద్ధం చేయ‌డం విశేషం. విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత జ‌గ‌దాంబ థియేట‌ర్లో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఏపీలో తాజాగా క‌ర్ఫ్యూను ఇంకో ప‌ది రోజులు పొడిగించిన ప్ర‌భుత్వం.. ఉద‌యం 6-12 గంట‌ల మ‌ధ్య జ‌నాలు బ‌య‌ట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వ‌హించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంట‌లు పొడిగించింది. అంటే మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు అన్ని కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయ‌న్న‌మాట‌.

క‌ర్ఫ్యూ పెట్ట‌డానికి ముందు థియేట‌ర్ల‌పై ప్ర‌త్యేకంగా ఆంక్ష‌లేమీ పెట్ట‌ని నేప‌థ్యంలో ఇప్పుడు మార్నింగ్ షో ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశం దొరికింది. దీంతో జ‌గ‌దాంబ థియేట‌ర్ యాజ‌మాన్యం ఉద‌యం ప‌దిన్న‌ర నుంచి మార్నింగ్ షో ఒక‌టి న‌డిపించే ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ త‌ర్వాత తెరుచుకుని సినిమా న‌డిపించ‌బోతున్న‌ తొలి, ఏకైక థియేట‌ర్ ఇదే కావ‌డం విశేషం.

This post was last modified on June 13, 2021 9:06 am

Share
Show comments

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

3 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

3 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

3 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

4 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

6 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

7 hours ago