Movie News

హరీష్-బండ్ల గొడవలోకి ఆయనొచ్చాడు

కొన్ని రోజులుగా హరీష్ శంకర్, బండ్ల గణేష్‌ల మధ్య ఒక వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు, నిర్మాతల మధ్య ఎందుకు పొరపొచ్ఛాలు వచ్చాయన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. హరీష్‌ రీమేక్‌లతో తప్ప హిట్లు కొట్టలేడని బండ్ల కామెంట్ చేయడం.. దానికి హరీష్ దీటుగా బదులివ్వడం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల మాట్లాడుతూ హరీష్ శంకర్‌తో ఇక ఎప్పటికీ తాను సినిమా తీయబోనని ప్రకటించాడు. దీనికి హరీష్ ఏమీ స్పందించకుండా సైలెంటుగా ఉన్నాడు. ఐతే ఉన్నట్లుండి ఈ గొడవలోకి నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తలదూర్చడం గమనార్హం. బండ్ల పేరెత్తకుండా అతడి మీద సెటైర్లు గుప్పిస్తూ ఒక ట్వీట్ వేశాడు పీవీపీ.

‘‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి.. వెయిటింగ్’’ అంటూ ట్వీట్ వేశాడు పీవీపీ.

దీనికి కొనసాగింపుగా.. ‘‘హరీష్.. తమ్ముడు స్టార్ యువర కుమ్ముడు’’ అని ఇంకో ట్వీట్ కూడా వేశారాయన. ఐతే హరీష్ పీవీపీ కోరుకున్నట్లు కుమ్మేసే పంచ్‌లు ఏమీ వేయకుండా కాస్త హుందాగానే స్పందించాడు. ‘‘మీ భాష, భావం రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ‘ఫైటే’ అక్కర్లేదు. ‘ట్వీటే’ చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు’’ అంటూ బదులిచ్చాడు హరీష్.

ఇంతకీ ఈ గొడవలోకి పీవీపీ ఎందుకొచ్చాడన్న సందేహం చాలామందికి రావచ్చు. బండ్ల నిర్మించిన ‘టెంపర్’ సినిమాకు ఫైనాన్స్ చేసింది పీవీపీనే. ఐతే తనకు వెనక్కివ్వాల్సిన మొత్తంలో 7 కోట్ల దాకా బకాయి పడటంతో పీవీపీ కోర్టుకెక్కాడు. దీనిపై కేసు నడుస్తోంది. గత ఏడాది ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు, కేసులు ప్రతి కేసులు నడిచాయి.

This post was last modified on May 18, 2020 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం సంపూర్ణ భరోసా

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…

14 minutes ago

త‌మ్ముళ్లు వ‌ర్సెస్ త‌మ్ముళ్లు: ఎవ‌రూ స‌రిగా లేరు.. !

టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.. స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. సాధార‌ణంగా…

20 minutes ago

విశాల్ ఆరోగ్యం వెనుక అసలు నిజం

ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు…

24 minutes ago

లెజెండరీ సలహా వినవయ్యా అనిరుధ్

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల…

53 minutes ago

కూటమి పోస్టర్ లోకి లోకేశ్ ఎంట్రీ ఇచ్చేశారు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం…

2 hours ago

జరగండి జరగండి పాటలో AI మాయాజాలం

కొత్త టెక్నాలజీగా మొదలై విప్లవంగా మారుతున్న ఏఐ సాంకేతికత భవిష్యత్తులో ఎన్ని పుంతలు తొక్కుతుందో కానీ ప్రాధమిక దశలో ఇది…

2 hours ago