మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ఏ ముహూర్తాన అడుగు పెట్టాడో కానీ.. అప్పట్నుంచి అభిమానుల్ని మామూలుగా ఎంటర్టైన్ చేయట్లేదు. ఆయన ఒక మెసేజ్ పెట్టినా.. ఒక ఫొటో షేర్ చేసినా.. ఒక వీడియో పంచుకున్నా.. అందులో పంచ్ కచ్చితంగా ఉంటోంది. కొన్ని ఎమోషనల్ వీడియోల్ని పక్కన పెడితే.. చిరు టార్గెట్ ఎంటర్టైన్మెంటే.
తాజాగా ఆయన ఒక ఆసక్తికర ఫొటోతో అభిమానుల్ని మురిపిస్తున్నారు. వంట గదిలో భార్య పక్కనుండగా సీరియస్‌గా వంటలో నిమగ్నమైన రెండు ఫొటోల్ని చిరు షేర్ చేశారు. ఐతే ఆ రెండు ఫొటోల మధ్య గ్యాప్ 30 ఏళ్లు కావడం విశేషం.
1990లో భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన చిరు.. సీరియస్‌గా గరిట చేతబట్టి ఏదో వండే ప్రయత్నంలో ున్నాడు. అప్పుడు చిరు బ్లూ టీ షర్ట్, జీన్స్‌లో ఉన్నారు. పక్కన సురేఖ ఎరుపు రంగు చీర కట్టుకుని ఉన్నారు.
దాదాపు అదే డ్రెస్సింగ్.. అదే వాతావరణంతో ఇప్పుడు చిరు, సురేఖ ఫొటో దిగారు. చిరు అప్పట్లాగే బ్లూ టీషర్ట్, జీన్స్ వేసుకుని కుడి చేత్తో గరిట, ఎడమ చేత్తో పాన్ పట్టుకుని సీరియస్‌గా వంట పనిలో నిమగ్నమై ఉండగా.. పక్కన పాత్ర పట్టుకుని సురేఖ ఎరుపు రంగు చీరలో నిలబడి ఉన్నారు.
పాత ఫొటోకు ‘జాయ్ ఫుల్ హాలిడే ఇన్ అమెరికా 1990’ అని క్యాప్షన్ పెట్టిన చిరు.. ప్రస్తుత ఫొటోకు మాత్రం ‘జైల్ ఫుల్ హాలిడే ఇన్ కరోనా 2020’ అంటూ తనదైన శైలిలో చమత్కారం జోడించారు. ఈ ఫొటో నిమిషాల్లో వైరల్ అయిపోయింది.
చాలామంది స్టార్లు సోషల్ మీడియాలో ఉన్నామంటే ఉన్నాం అనిపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే తమ స్థాయి తగ్గిపోతుందేమో అన్నట్లుగా గుంభనంగా ఉంటున్నారు. కానీ చిరు మాత్రం అలాంటి శషబిషలేమీ పెట్టుకోకుండా నిరంతరం ఎంటర్టైన్ చేస్తూ సాగుతుండటం ఆయన ప్రత్యేకతను చాటి చెబుతోంది.
This post was last modified on May 18, 2020 1:28 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…