షారుఖ్ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరో. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ అతడి వెనుకే ఉండేవాళ్లు. షారుఖ్ ఫ్లాప్ సినిమాలకు కూడా వేరే హిట్ సినిమాలకు మించి కలెక్షన్లు వచ్చేవి. ఓపెనింగ్స్‌తోనే బయ్యర్లు సేఫ్ అయిపోయేవాళ్లు. కానీ ఈ ఫాలోయింగ్, మార్కెట్ చూసి విర్రవీగితే.. టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే ఏం జరుగుతుందో గత కొన్నేళ్లలో చూశాం.
క్వాలిటీ గురించి ఆలోచించకుండా పనికి రాని సినిమాలు చేసి పూర్తిగా మార్కెట్‌ను దెబ్బ తీసుకున్నాడు షారుఖ్. ‘జీరో’ సినిమాతో అతను జీరో అయిపోయాడంటే అతిశయోక్తి కాదు. తాము ఏం చేసినా జనాలు చూస్తారనే అభిప్రాయంతో ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి షారుఖ్ ఉదంతమే ఉదాహరణ.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ సైతం ఇదే బాటలో నడుస్తున్నాడేమో అనిపిస్తోంది. షారుఖ్ మంచి ఊపులో ఉన్నపుడు డౌన్ అయిన సల్మాన్.. ‘వాంటెడ్’ సినిమా నుంచి పుంజుకుని మళ్లీ మార్కెట్‌ను విస్తరించాడు. కొన్ని భారీ విజయాలు అందుకున్నాడు.
కానీ మాస్ మసాలా సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా అని.. వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకుంటున్నాడు సల్మాన్. రేస్-3, దబంగ్-3, తాజాగా వచ్చిన రాధె సినిమాలు చూస్తే సల్మాన్ తన సినిమాల క్వాలిటీ విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ కనీస కసరత్తు లేకుండా మసాలా సినిమాలు చేసుకుపోతున్నాడు. కొత్తదనం గురించి అసలేమాత్రం ఆలోచించట్లేదు.
‘రాధె’ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులే కాదు.. సల్మాన్ ఫ్యాన్స్ సైతం అతణ్ని, దర్శకుడు ప్రభుదేవాను తెగ తిట్టుకున్నారు. ఇలాంటి సినిమాలే చేసుకుపోతుంటే సల్మాన్ పరిస్థితి కూడా షారుఖ్‌లా తయారైనా ఆశ్చర్యం లేదు. కానీ సల్మాన్‌లో తన సినిమాల పట్ల ఎలాంటి రిగ్రెట్ లేనట్లే ఉంది. ‘కిక్-2’ అంటూ మరో మసాలా సినిమాను లైన్లో పెట్టిన అతను.. తమిళ చిత్రం ‘మాస్టర్’ రీమేక్‌లో నటించనున్నాడట.
ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు కానీ.. అదేమంత స్పెషల్ మూవీ కాదు. హీరో ఎలివేషన్లు, మాస్ సీన్లు తప్ప పెద్దగా ఏమీ ఉండదు. ఇలాంటి రొటీన్ మూవీలే చేసుకుపోతుంటే సల్మాన్ ప్రమాదంలో పడటం ఖాయమని హెచ్చరికలు వస్తున్నప్పటికీ అతనేమీ మారేలా కనిపించడం లేదు.
This post was last modified on June 11, 2021 4:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…