టాలీవుడ్ లో గ్లామరస్ రోల్స్ లో కనిపించిన తాప్సీ ఇక్కడ సరైన అవకాశాలు రావడం లేదని బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ ‘పింక్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది ఆమె నటించిన ‘తప్పడ్’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఐదు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వార్తల్లో నిలిచాయి.
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ఉన్న తాప్సీ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు రాగా.. వాటిపై క్లారిటీ ఇచ్చింది తాప్సీ. డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ తో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉంది తాప్సీ. కానీ తన లవ్ లైఫ్ గురించి బయట పెద్దగా మాట్లాడదు. కానీ అతడితో పెళ్లి ఎప్పుడనే దానిపై వివరణ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది.
వృత్తి, వ్యక్తిగత జీవితాలు వేర్వేరుగా ఉండాలనుకుంటానని తెలిపింది. మాథ్యూస్ తనకు చాలా కావాల్సిన వ్యక్తి అని.. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏడాదికి ఆరు సినిమాల్లో నటిస్తున్నానని.. ఈ సంఖ్య రెండు లేదా మూడుకు తగ్గినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అప్పుడైతేనే తన పూర్తి సమయం ఫ్యామిలీకి కేటాయించగలని వివరించింది.
This post was last modified on June 11, 2021 12:36 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…