పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చేయనున్నారు హరీష్ శంకర్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ అలానే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తోన్న పవన్ వీటి తరువాత హరీష్ శంకర్ తో సినిమా మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ నెలలోనే ఈ కాంబో పట్టాలెక్కాల్సింది కానీ కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కి జోడీగా స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ సమంతను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు టాక్. గతంలో హరీష్ శంకర్ రూపొందించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ తో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో రొమాన్స్ చేసింది సమంత. వెండితెరపై వీరి కెమిస్ట్రీ బాగానే పండింది. ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి తన సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఎలాంటి పాత్రలోనైనా సమంత ఒదిగిపోతారు. అందుకే మేకర్లు ఆమెని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె తెలుగులో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దీంతో పవన్ సినిమాకి కాల్షీట్స్ సమస్య కూడా రాదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on June 10, 2021 8:19 am
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…