భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన అన్ని రాష్ట్రాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగించిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. ఆరేళ్ల కిందట మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. యువ ప్రేక్షకులను మైమరిపించేసింది. మలయాళంలో ఆ సమయానికి ఇది బిగ్గెస్ట్ హిట్. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ తెగ చూసేసి భారీ విజయాన్నందించారు. ఆ తర్వాత వేరే భాషల వాళ్లు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
‘ప్రేమమ్’కు సంబంధించి ఆర్టిస్టుల పరంగా అతి పెద్ద ఆకర్షణ అంటే.. సాయిపల్లవినే అనడంలో సందేహం లేదు. మలర్ పాత్రలో ఆమెను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన లుక్స్, నటనతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాకు పెద్ద ఆకర్షణగా మారింది. ఐతే ఇంతగా పేరు తెచ్చిన ఆ సినిమాలో నిజానికి సాయిపల్లవి నటించాల్సిందే కాదట.
‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మలర్ పాత్ర కోసం ముందు సాయిపల్లవిని అనుకోనే లేదని వెల్లడించాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్‌ను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పాత్రను రాసినట్లు అతను వెల్లడించాడు. ఐతే అసిన్ కెరీర్ అప్పటికే చరమాంకానికి వచ్చేసింది. ఆమె సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితంలో సెటిలయ్యే ఆలోచనలో ఉంది. అందువల్ల ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. దీంతో తర్వాత వేరే వాళ్ల వైపు చూశానని.. సాయిపల్లవి లాంటి ఫ్రెష్ ఫేస్ ఈ పాత్రకు బాగుంటుందని ఆమెను ఎంచుకున్నానని అల్ఫాన్సో వెల్లడించాడు.
అసిన్ మలర్ పాత్రను చేసి ఉంటే కచ్చితంగా ప్రేక్షకుల అనుభూతి మరోలా ఉండేది. ఆమె మంచి నటి, అందగత్తే అయినప్పటికీ ఒక ఫ్రెష్ ఫేస్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది. ముఖ్యంగా సాయిపల్లవి డిఫరెంట్ లుక్స్, ఆమె నటన సినిమాకు ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. ఆమె లేని ‘ప్రేమమ్’ను ఊహించుకోవడం కూడా కష్టమే అంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on June 8, 2021 9:42 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…