శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తి చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో కలిసి ‘థాంక్యూ’ సినిమాకి వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో చైతు తన తదుపరి సినిమాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగులో ఓ కొత్త సినిమాను ప్రారంభించడానికి ముందు చైతు బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు.
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని సంప్రదించారు. మొదట ఆయన అంగీకరించినప్పటికీ ఆఖరి నిమిషంలో డేట్స్ ఇష్యూ రావడంతో సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో విజయ్ కి బదులుగా నాగచైతన్యను తీసుకున్నారు.
హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాలో మైకేల్టి విలియంసన్ పోషించిన ‘బుబ్బా’ అనే పాత్ర కోసం చైతుని తీసుకున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆర్మీ మ్యాన్ గా కనిపించడానికి చైతు తన లుక్ ని మార్చుకోబోతున్నారు. కాశ్మీర్ లోని కార్గిల్ లో లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో చైతుపై కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నారు. కరోనా ఉదృతి తగ్గగానే షూటింగ్ ను మొదలుపెడతారు.
This post was last modified on June 8, 2021 2:09 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…