వెళ్లిపోమాకే అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విశ్వక్‌సేన్. అందులో చాలా డల్లుగా ఉండే పాత్ర చేసిన విశ్వక్ పెద్దగా జనాల దృష్టిలో పడలేదు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా జనాలకు రీచ్ కాలేదు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ నగరానికి ఏమైంది పర్వాలేదనిపించింది తప్ప.. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోవడంతో విశ్వక్ గురించి పెద్దగా చర్చ లేకపోయింది. కానీ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో రూపొందించిన ఫలక్‌నుమా దాస్‌తో అతడి పేరు మార్మోగింది.
ఈ సినిమా కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. మలయాళం బ్లాక్‌బస్టర్ అంగామలై డైరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వక్ ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. దాస్ పాత్రలో అతడి దూకుడు యూత్‌కు బాగా నచ్చింది. ఆ సినిమాతోనే విశ్వక్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
హిట్ మూవీతో మంచి హిట్ కొట్టి.. ప్రస్తుతం పాగల్ సహా రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విశ్వక్.. త్వరలోనే ఫలక్‌నుమా దాస్‌కు సీక్వెల్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమా వచ్చినపుడే విశ్వక్ దీనికి సీక్వెల్ ఉంటుందన్నాడు కానీ.. ఆ తర్వాత దాని ఊసే లేదు. కేవలం పబ్లిసిటీ కోసం చెప్పిన మాటలాగే అనిపించిందది. కానీ ఫలక్‌నుమా దాస్ రిలీజైన మూడేళ్లు కావస్తుండగా ఇప్పుడు అతను సీక్వెల్ గురించి సంకేతాలు ఇవ్వడం విశేషం.
ఈ సినిమా ప్రారంభోత్సవం జరిపి మూడేళ్లు అయిన సందర్భంగా ముహూర్త కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన విశ్వక్.. ఫలక్‌నుమా దాస్-2 ఉంటుందని, త్వరలోనే ఆ చిత్రం మొదలవుతుందని ప్రకటించాడు. ఐతే ఫలక్‌నుమా దాస్ ఒరిజినల్ అంగామలై డైరీస్‌కు మలయాళంలో సీక్వెల్ ఏమీ రాలేదు. అంటే ఈసారి సొంతంగా కథ అల్లుకుని విశ్వక్ రంగంలోకి దిగుతాడన్నమాట.
This post was last modified on June 8, 2021 7:29 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…