నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు మొదట్నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రకటించినప్పటికీ అంతా బాగున్నట్లే ఉంది. సింహా, లెజెడ్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినమాను ముందు తన సొంత బేనర్లో నిర్మించాలని బాలయ్య అనుకున్నాడు.
ఐతే యన్.టి.ఆర్ చేదు అనుభవంతో వెనక్కి తగ్గి మిర్యాల రవీందర్ రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. తర్వాత కొంత కాలానికి బాలయ్య మార్కెట్ పడటం చూసి బడ్జెట్లో కోతలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి అన్ని ఇబ్బందులనూ అధిగమించి సినిమా చిత్రీకరణ మొదలుపెడితే.. ఇంతలో కరోనా బ్రేక్ వేసింది. చిత్రీకరణ ఆగిపోయింది.
ఐతే లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే మిగతా చిత్రాల షూటింగ్ మొదలుపెట్టడానికి ఎవరికి వాళ్లు సన్నాహాలు చేసుకుంటుండగా.. బాలయ్య టీం మాత్రం సందిగ్ధంలో ఉంది.
ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఒక పెక్యులర్ గెటప్‌లోకి మారాడు బాలయ్య. దీని వెనుక కొన్ని నెలల కృషి ఉంది. ఐతే ఆ పాత్ర తాలూకు చిత్రీకరణ అంతా వారణాసిలో చేయాల్సి ఉంది.
వేరే రాష్ట్రాలకు వెళ్లి వందల మందితో చిత్రీకరణ జరిపే పరిస్థితులు రావడానికి చాలా నెలలు పట్టేట్లుంది. ఈ ఏడాది అందుకు అవకాశం ఉంటుందా అన్నది సందేహమే. కాశితో పాటు మరికొన్ని ఉత్తరాది ప్రాంతాల్లోనూ ఈ చిత్రం షూటింగ్ చేయాల్సి ఉంది. మరి అక్కడ ఇప్పుడిప్పుడే అనుమతులు రాకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల చాలా ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతికైనా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ కుదురుతుందో లేదో?
This post was last modified on May 17, 2020 1:26 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు(ఆర్థిక సదస్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా పోటా…
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…