సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో జోరు పెంచాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అయింది. కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా అది కూడా ఆలస్యమవుతోంది. దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మరో ఆరు నెలల్లో.. అంటే వచ్చే ఏడాది వేసవికి తన నుండి మరో సినిమా విడుదలయ్యే విధంగా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుండి మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రీప్రొడక్షన్ వర్క్ ను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అనుకున్న ప్రకారం షూటింగ్ ను పూర్తి చేసి వేసవి నాటికి ఫస్ట్ కాపీ రెడీ ఉండేలా ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకపోతే.. మహేష్ బాబు నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల కావడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
This post was last modified on June 6, 2021 7:01 am
నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…
నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…
భారీ అంచనాల మధ్య విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ చూసి అజిత్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచందర్…
మాస్ రాజా రవితేజ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. కరోనా కాలంలో వచ్చిన క్రాక్ మూవీనే రవితేజకు…