లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన కెరీర్ లో వందల సంఖ్యలో గీతాలను ఆలపించారు. అక్కడితో ఆగిపోకుండా ‘పాడుతా తీయగా’ అనే షోతో సినిమా ఇండస్ట్రీకి ఎందరో సింగర్స్ ను పరిచయం చేశారు. ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నాయి. ఇందులో పాల్గొనే వారికి ఎస్పీ బాలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రతి పాట.. దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెబుతూ ఆకట్టుకునేవారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ షో బాలు మరణంతో ఆగిపోయింది.
ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనేది అక్షర సత్యం. అందుకే ‘పాడుతా తీయగా’ షోకి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ షోకి సంబంధించిన బాధత్యలను రామోజీరావు.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ షోని చరణ్ తో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే చరణ్ తో పాటు ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, గాయని సునీతలు కూడా న్యాయనిర్ణేతలుగా ఉంటారట.
ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ‘పాడుతా తీయగా’ షోను కొనసాగించబోతున్నారు. రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎస్పీ బాలు స్థానంలో ఆయన కుమారుడు ఈ షోని ఎంతవరకు రక్తి కట్టించగలరో చూడాలి. మొత్తానికి ఈ న్యూస్ సంగీత ప్రియులకు ఆనందం కలిగించేదనే చెప్పాలి. ఈ షోతో మరింత మంది గాయనీ గాయకులకు మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం!
This post was last modified on June 4, 2021 7:21 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…