మిగతా స్టార్ హీరోయిన్లతో పోలిస్తే చాలా లేటుగా ‘లేడీ ఓరియెంటెడ్’ సినిమాల లీగ్‌లోకి వచ్చింది కాజల్ అగర్వాల్. రెండేళ్ల కిందట ఆమె తన గాడ్‌ఫాదర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’లో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కాజల్ అందం, అభినయం రెండింట్లోనూ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా అయితే సరిగా ఆడలేదు. అయినప్పటికీ కాజల్ ఏమీ వెనక్కి తగ్గలేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైవ్ టెలికాస్ట్’ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోనూ లీడ్ రోల్స్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
కాజల్ ప్రధాన పాత్రలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రాబోతుండటం విశేషం. ఇందులో ఒకటి ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమా గురించి ప్రకటన రావాల్సి ఉంది. ఈ లోపు కాజల్ లీడ్ రోల్‌లో ‘ఉమ’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. తథాగత సింఘా అనే యాడ్ ఫిలిం మేకర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అవిషేక్ ఘోష్, మంత్రరాజ్ పలివాల్‌ల ఆధ్వర్యంలోని మిరాజ్ గ్రూప్ అనే కార్పొరేట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇది ‘క్వీన్’ తరహా చిత్రమట. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెరకెక్కించనున్నారు.
పెళ్లి తర్వాత ఏమాత్రం జోరు తగ్గించకుండా దూసుకుపోతున్న కాజల్.. మధ్యలో కాస్త దెబ్బ తిన్న గ్లామర్‌ను కూడా తిరిగి తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటిలా ఆమె లుక్స్ కనిపిస్తుండటం విశేషం. ఈ క్రమంలో ఆమెకు అవకాశాల విషయంలో ఢోకా లేకపోయింది. పెళ్లికి ముందే ఖరారైన ఆచార్య, ఇండియన్-2 లాంటి భారీ చిత్రాలకు తోడు కొత్తగా నాగార్జున సినిమాలోనూ కథానాయికగా నటిస్తున్న కాజల్‌కు.. ఇప్పుడు రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు రావడం విశేషమే. కాజల్ ప్లానింగ్ చూస్తే ఆమె చాలా ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగేలాగే ఉంది.
This post was last modified on June 4, 2021 1:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…