టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకరు. 80లు, 90ల్లో ఈవీవీ ఎన్నో సూపర్ హిట్లు అందించాడు. రాఘవేంద్రరావుకు దీటైన కమర్షియల్ డైరెక్టర్‌గా నిలిచాడు. కెరీర్లో 70 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన ఘనుడాయన. అలాంటి లెజెండరీ డైరెక్టర్.. కెరీర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట.
హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి రైల్లో ప్రయాణిస్తూ గోదావరిలో దూకి చనిపోవాలనుకున్నారు. అందుకు మానసికంగా సిద్ధమైపోయిన ఆయన.. చివరి క్షణాల్లో తన కొడుకులు గుర్తుకొచ్చి ఆగిపోయారు.. తాను ఆత్మహత్య చేసుకుంటే కొడుకుల్ని తన భార్య ఎలా చూసుకుంటుంది.. వాళ్ల భవిష్యతేంటి అనుకుని ఆ ఆలోచన మానుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడానికి కారణం.. దర్శకుడిగా అరంగేట్రం చేసిన చెవిలో పువ్వు చిత్రమేనట.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈవీవీ తీసిన తొలి సినిమా చెవిలో పువ్వు ఫ్లాప్ అయింది. దీంతో ఈవీవీని ఎవ్వరూ పట్టించుకోలేదట. మరో అవకాశం రావడం కష్టమే అనిపించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన.. ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన చేశాడు. ఐతే చివరి క్షణంలో వెనక్కి తగ్గిన ఆయన.. దర్శకుడిగా అవకాశం రాకపోతే మళ్లీ కోడైరెక్టర్‌గా పని చేసి అయినా బతుకుదాం అనుకున్నారు.
ఐతే ఈవీవీలో ప్రతిభను గుర్తించిన అగ్ర నిర్మాత రామానాయుడు.. ఆయనకు దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చారు. అలా తీసిన చిత్రమే.. ప్రేమఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈవీవీ కెరీర్‌ను మార్చింది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అల్లరి నరేష్.. తన తండ్రి ఆత్మహత్య వరకు వెళ్లిన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on May 17, 2020 12:00 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…