‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ రానాతో ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సురేష్ బాబు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అయితే ఎంత కాలమవుతున్నా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. రానా వేరే ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వడం, మరోపక్క గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను అనౌన్స్ చేయడంతో ఇక ‘హిరణ్య కశ్యప’ ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని గుణశేఖర్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్, రానా మార్కెట్ రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని సురేష్ బాబు నిర్మాతగా వెనుకడుగు వేశారట. సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువయ్యే అవకాశాలు ఉండడంతో ప్రీప్రొడక్షన్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ.. అక్కడితో ఆగిపోతే మంచిదని భావించి సురేష్ బాబు నిర్మాతగా తప్పుకున్నారని సమాచారం. అందుకే సినిమా పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ తరువాత ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడం విశేషం. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డామని.. కాబట్టి కచ్చితంగా సినిమా చేసి తీరుతామని అంటున్నారు. మరి ఇంతటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో తెలియదు. ఒకవేళ ‘శాకుంతలం’ గనుక మంచి సక్సెస్ అందుకొని భారీ లాభాలను తీసుకొస్తే.. ఎప్పటిలానే ‘హిరణ్య కశ్యప’ సినిమాను కూడా గుణశేఖర్ సొంతంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on June 3, 2021 7:11 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…