జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సమయం సమీపిస్తోంది. ఇంకో మూడు రోజుల్లో తారక్ జన్మదినం. ఈసారి తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు ఓ రేంజిలో హంగామా చేయాలని అభిమానులు.. తారక్ పీఆర్వో టీం గట్టిగా ఫిక్సయినట్లుంది. ఇంతకుముందే ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డిస్ ప్లే పిక్ లాంచ్ కొన్ని రోజుల కిందట సందడిగా సాగింది.
25 మంది ఫిలిం సెలబ్రెటీలతో ఒకేసారి ఎన్టీఆర్ సీడీపీని రిలీజ్ చేయించారు. మామూలుగా ఇలాంటివి అభిమానులే తయారు చేస్తారు. వాళ్లే సర్క్యులేట్ చేస్తారు. కానీ తారక్ సీడీపీని మాత్రం వాల్స్ అండ్ ట్రెండ్స్ సంస్థతో ప్రత్యేకంగా తయారు చేయించారు. సెలబ్రెటీలను ఇన్వాల్వ్ చేసి దాన్ని లాంచ్ చేయించి హంగామా చేశారు. ఇప్పుడు తారక్ పుట్టిన రోజుకు సంబంధించి కొత్త పోస్టర్లు తయారయ్యాయి.
ఎన్టీఆర్‌కు తెలుగుతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో శుభాకాంక్షలు చెబుతున్న పోస్టర్లు తయారు చేయించారు. నాలుగు భాషలకు సంబంధించిన పోస్టర్లను హరీష్ శంకర్‌తో పాటు మరికొందరు ప్రముఖులతో లాంచ్ చేయించారు. జై లవకుశలోని జై పాత్రకు సంబంధించిన చిత్రంతో ఈ పోస్టర్ తయారైంది. నా అభిమానులకు ఏం జరిగినా తట్టుకోలేను.
నా ఒక్కొక్క అభిమాని ఒక్కో వజ్రంతో సమానం అని తారక్ గతంలో చెప్పిన మాటను కోట్ చేయడంతో పాటు.. వివిధ సందర్భాల్లో తారక్ మాటల్ని ఈ పోస్టర్లో చక్కగా పేర్చారు. మొత్తానికి వ్యవహారం చూస్తుంటే ఈ పుట్టిన రోజు నాడు తారక్ క్రేజ్ ఏంటో అందరికీ తెలియజేసే ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
అభిమానుల్ని బాగా మోటివేట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఈ ఉత్సాహంలో తారక్ పుట్టని రోజు నాడు అభిమానులు ట్విట్టర్ బర్త్ డే ట్రెండ్స్ రికార్డుల అంతు చూస్తారేమో చూడాలి.
This post was last modified on May 16, 2020 11:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…