భారతీయ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోగా.. సెకండ్ సీజన్‌కు సమంత ఆకర్షణ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. దీన్ని ఇప్పటిదాకా బాగా ప్రమోట్ చేస్తూ కూడా వచ్చారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఐతే ప్రిమియర్లకు రెండు వారాల ముందే ప్రమోషన్లు హోరెత్తించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ టీం.. విడుదలకు మూడు రోజుల ముందు సైలెంటుగా ఉండటం గమనార్హం. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ప్రమోషన్లు ఓ రేంజిలో జరుగుతుండాలి. సమంత మీడియాలో హల్‌చల్ చేస్తుండాలి. కానీ ఆమె సహా టీంలోని ఎవ్వరూ ఈ సిరీస్‌ను ప్రమోట్ చేయట్లేదు. నిజానికి ఈ సిరీస్ గురించి ఇప్పుడు వార్తలు రాకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో దీని టీం ఉంది.
ఇందుకు కారణం కరోనా ఏమీ కాదు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ చుట్టూ ముసురుకున్న వివాదం. ఇందులో సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను పోలి ఉండటంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే. తమిళ జనాలు ట్రైలర్ చూసి బాగా హర్టయ్యారు. తమ మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్న ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే లేఖలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో జూన్ 4న అనుకున్నట్లుగా ఈ సిరీస్‌కు అమేజాన్ ప్రైమ్‌లో ప్రిమియర్స్ పడతాయా అన్న సందేహాలు కలిగాయి. ఐతే రెండు మూడు రోజుల వేడి తర్వాత ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.
తమ సిరీస్ చూసి ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావాలని దీని మేకర్స్ రాజ్-డీకే ప్రకటన చేసి ఊరుకున్నారు. ఇక అప్పట్నుంచి స్తబ్దత నడుస్తోంది. ఇప్పుడు రిలీజ్ ముంగిట ప్రమోషన్లు అవీ చేస్తే తమిళ జనాలు మళ్లీ నిషేధం డిమాండ్లు చేయొచ్చు. మళ్లీ రగడ తప్పకపోవచ్చు. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ మేకర్స్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. కాగా ఈ సిరీస్ కోసం చాలా ఎగ్జైటెట్‌గా ఉన్న ప్రేక్షకులు మాత్రం #Excitedforfamilyman2 అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. బహుశా ఈ సిరీస్‌ను నిషేధించాలని కోరే వాళ్లను మించి ఇది ప్రసారం కావాలని కోరుకుంటున్న వాళ్లు ఎక్కువమంది అని చెప్పడానికి కూడా ఇలా ట్రెండ్ చేస్తుండొచ్చు.
This post was last modified on May 31, 2021 3:38 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…