ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర భాషల్లో సక్సెస్ అయిన కథలను తీసుకొని వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది హీరోలు సక్సెస్ లు కూడా అందుకున్నారు. ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఓ రీమేక్ కథలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
కోలీవుడ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కర్ణన్’ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ బెల్లంకొండ సురేష్ తీసుకున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ నటుడు రావు రమేష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ కి తాత వరసయ్యే పాత్రలో మలయాళ నటుడు లాల్ కనిపించారు. ఈ సినిమాలో లాల్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది.
హీరోకు అండగా నిలబడి, మార్గనిర్దేశనం చేసే ముసలి స్నేహితుడిగా లాల్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర కోసమే రావు రమేష్ ని సంప్రదించారట. అయితే ఈ విషయంలో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వైవిధ్యమైన పాత్రల్లో నటించడానికి ముందుండే రావు రమేష్ ‘కర్ణన్’ రీమేక్ లో నటిస్తే సినిమాకి మరింత మైలేజ్ వస్తుందని మేకర్లు భావిస్తున్నారు. మరి ఈ పాత్రకు రావు రమేష్ ఓకే చెప్తారో లేదో చూడాలి!
This post was last modified on May 29, 2021 4:29 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…