Movie News

కళ్యాణ్ రామ్.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?

టాలీవుడ్లో సాహసాలకు పెట్టింది పేరు నందమూరి కళ్యాణ్ రామ్. కాకపోతే అతను చేసే రిస్క్‌లు కొంచెం క్యాల్కులేటెడ్‌గా ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటూ ఉంటారు. తన మార్కెట్ పరిధికి మించి బడ్జెట్లతో సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం అతడికి అలవాటు. గతంలో హరే రామ్, ఓం అనే సినిమాలతో అతను ఇలాగే దారుణంగా దెబ్బ తిన్నాడు. ముఖ్యంగా ‘ఓం’ సినిమా కోసం చేసిన సాహసం కళ్యాణ్‌రామ్‌ను ముంచేసిందనే చెప్పాలి.

యాక్షన్ సినిమాను త్రీడీలో చేయడమేంటో.. దాని మీద అప్పట్లోనే 25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడమేంటో ఎవరికీ అర్థం కాలేదు. దాని మీద పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. దానికి ముందు తర్వాత కూడా ఇలాంటి ఎదురు దెబ్బలే తిన్నాడు ఈ నందమూరి హీరో. రవితేజ హీరోగా తన ప్రొడక్షన్లో తీసిన ‘కిక్-2’కు సైతం అవసరానికి మించి ఖర్చు చేసి భారీ నష్టం చవిచూశాడు. ఇప్పుడిక హీరోగా తన కెరీర్ ఏమంత బాగా లేని స్థితిలో ఒక భారీ పీరియడ్ ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. అదే.. బింబిసర.

శుక్రవారం సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు కళ్యాణ్ రామ్. అది చూస్తే చరిత్రలోకి వెళ్లి ఒక అన్ టోల్డ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌లో భారీతనానికి లోటు లేదు. కానీ ఇలాంటి సినిమాలు పెద్ద హీరోలు, దర్శకులు చేస్తేనే బాగుంటుంది. వాళ్లకే నప్పుతాయి. ఈ తరహా చిత్రాలకు బడ్జెట్లు భారీగా అవుతాయి. క్వాలిటీ పరంగా రాజీ పడితే కష్టం. అలాగని భారీ బడ్జెట్లు పెట్టాలంటే అందుకు తగ్గ మార్కెట్ హీరో, దర్శకుడికి ఉండాలి.

కానీ కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కొత్త దర్శకుడు ఇలాంటి భారీ సినిమా చేయడం అంటే చాలా పెద్ద రిస్కే. పైగా కళ్యాణ్ రామ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా సినిమాలకు నప్పుతాయా అన్న డౌట్లూ ఉన్నాయి. చిన్న హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని కాదు కానీ.. రిస్క్ చాలా ఉంటుంది. అందులోనూ ‘ఎంతమంచివాడు కానీ’ లాంటి డిజాస్టర్ తర్వాత, మార్కెట్ బాగా దెబ్బ తిన్న టైంలో కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేస్తుండటంతో ఇది అతడికి తలకు మించిన భారం అవుతుందేమో అన్న భయాలు కలుగుతున్నాయి. మరి ఈ సందేహాలను పటాపంచలు చేసి ‘బింబిసర’ పెద్ద విజయం సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలవాలని ఆశిద్దాం.

This post was last modified on May 29, 2021 7:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

15 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

55 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago