Movie News

ఆ హీరోను మళ్లీ తీసేశారు

ప్యార్ కా పంచనామా, సోనూ కే టిటు కీ స్వీటీ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. ఈ మధ్య ఓ నెగెటివ్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘దోస్తానా 2’ లాంటి భారీ చిత్రం నుంచి అతను అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అతడిపై 20 రోజులకు పైగా షూటింగ్ జరిపారు. ఐతే స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడం, మరేవో కారణాలతో అతణ్ని ఈ చిత్రం నుంచి సాగనంపేశాడు కరణ్.

సినిమా మధ్యలో ఇలా హీరోను తప్పించడం వల్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. కరణ్ తగ్గలేదు. కార్తీక్ తీరు పట్ల ఆయనకు అంతగా కోపం వచ్చింది. అదేదో అనుకోకుండా జరిగిపోయింది, కార్తీక్ ఇక జాగ్రత్తగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో పెద్ద సినిమా నుంచి అతను బయటికొచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తెరకెక్కుతున్న ‘ఫ్రెడ్డీ’ సినిమాకు కూడా కార్తీక్ ఆర్యన్ దూరమయ్యాడు. ఈ సినిమా నుంచి అతణ్ని తప్పించారా.. తనే బయటికొచ్చేశాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలోనూ కార్తీక్ అభ్యంతరాలు చెప్పడంతోనే సాగనంపేశారని అంటున్నారు. సినిమాకు సంతకం చేసేటపుడు అంతా ఓకే అని.. ఇప్పుడు మధ్యలో అభ్యంతరాలు చెప్పడంతో మేకర్స్ అతడికి గుడ్ బై చెప్పేశారంటున్నారు. ఈ సినిమా కోసం తీసుకున్న రూ.2 కోట్ల అడ్వాన్సును అతను వెనక్కి ఇచ్చేశాడట.

ఐతే ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే లాక్ డౌన్ వచ్చి పని ఆపేశారు. దీని వల్ల హీరోను తప్పించడం వల్ల చిత్ర బృందానికి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడతడి స్థానంలో మరో హీరోను తీసుకుని లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇలా స్వల్ప వ్యవధిలో పెద్ద బేనర్లలో తెరకెక్కుతున్న రెండు చిత్రాలకు దూరం కావడం కార్తీక్ కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు.

This post was last modified on May 27, 2021 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

34 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

34 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

5 hours ago