Movie News

మే 31న పేలిపోయే అనౌన్స్‌మెంట్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మే 31వ తేదీ ఎంత ప్ర‌త్యేకంగా భావిస్తాడో తెలిసిందే. అది నిన్న‌టిత‌రం సూప‌ర్ స్టార్, మ‌హేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఏడాదీ ఆ తేదీన తండ్రికి, త‌మ కుటుంబ అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వ‌డం మ‌హేష్‌కు అల‌వాటు.

ఎక్కువ‌గా కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్‌, లేదంటే మేకింగ్ ద‌శ‌లో ఉన్న సినిమాల అప్ డేట్స్ ఉండేలా చూసుకుంటాడు మ‌హేష్‌. ఈ ఏడాది సినిమా కార్య‌క‌లాపాలేమీ లేక‌పోయినా.. ఒక పెద్ద అనౌన్స్‌మెంట్‌తో ఆ తేదీని ప్ర‌త్యేకంగా మార్చాల‌ని మ‌హేష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఆ రోజే ఉంటుంద‌ట‌. ఆ రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తాజా స‌మాచారం.

ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల్సింది. కానీ స్క్రిప్టు న‌చ్చ‌క ఆ చిత్రం క్యాన్సిల్ అయింది. దీంతో ఊహించ‌ని విధంగా ప‌ర‌శురామ్ లైన్లోకి వ‌చ్చాడు. గీత గోవిందం త‌ర్వాత ప‌ర‌శురామ్ సినిమా కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన స్టార్ హీరోల్లో మ‌హేష్ ఒక‌డు. వారి మ‌ధ్య కొన్ని రోజులు క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు క‌ద‌ల్లేదు. వంశీ సైడ‌య్యాక ప‌ర‌శురామ్‌ను మ‌ళ్లీ పిలిపించాడు. కొన్ని సంప్ర‌దింపుల త‌ర్వాత సినిమా ఓకే అయింది. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తాను మ‌హేష్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు, అది ఒక రేంజ్‌లో ఉండ‌బోతున్న‌ట్లు ప‌ర‌శురామ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. మ‌రి 31న మ‌హేష్ అభిమానులు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on May 16, 2020 1:00 am

Share

Recent Posts

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

26 minutes ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

27 minutes ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

2 hours ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

5 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

6 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

11 hours ago