Movie News

ఆ హీరోయిన్ అందం తిరిగొచ్చింది

రైజా విల్సన్.. నెల కిందట సోషల్ మీడియాలో మార్మోగిన పేరు. ఈ తమిళ నటి తన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ఒక డెర్మటాలజిస్టును సంప్రదించడం.. ఆమె చేసిన ఓ చర్మ చికిత్స వికటించి రైజా విల్సన్ అంద విహీనంగా తయారు కావడం తెలిసిందే. కంటి కింది భాగం వాచిపోయి.. ముఖారవిందం దెబ్బ తిన్న స్థితిలో రైజా పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. తనకు సదరు డెర్మటాలజిస్టు చేసిన చికిత్స వల్లే ఇలా జరిగిందంటూ ఆమె బోరున విలపించింది.

అవసరం లేకపోయినా ఆ వైద్యురాలు ఒత్తిడి చేసి ఈ చికిత్స చేశారని, ఫలితంగా తాను అందవిహీనంగా మారినట్టు చెప్పుకొచ్చింది. తనకు జరిగిన నష్టానికి కోటి రూపాయల నష్టపరిహారంతో చికిత్సకు తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. దీనిపై ఆ లేడీ డాక్టర్‌ కూడా దీటుగానే స్పందించింది. తన పేరును దెబ్బ తీసినందుకు రైజాపై రూ.5 కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ రాజీకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు జనాలు. ఐతే ఈ గొడవ తర్వాత నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన రైజా.. ఎట్టకేలకు మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది.

రైజా విల్సన్‌ ముఖం ఇప్పుడు పూర్వస్థితికి చేరుకుంది. కళ్ల కింద వాపు తగ్గింది. మళ్లీ రైజా అందంగా తయారైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే డాక్టర్‌తో గొడవ, చర్మ చికిత్స వికటించడం గురించి ఆమె ఇప్పుడేమీ మాట్లాడట్లేదు. గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. తమిళంలో రైజా విల్సన్ ‘వేలైయిల్ల పట్టాదారి-2’, ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’, ‘వర్మ’ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్‌ఐఆర్‌’ సహా నాలుగైదు సినిమాలున్నాయి.

This post was last modified on May 26, 2021 7:27 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

40 minutes ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

7 hours ago