హిందీలో ఎక్కువ సినిమాలు చేసి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తెలుగు కథానాయకుల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవాలి. గత రెండు దశాబ్దాల్లో ఆయన బాలీవుడ్లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ.. 90ల్లో ‘శివ’ సినిమాతో మొదలుపెట్టి ఖుదా గవా, ద్రోహి, అంగారే, క్రిమినల్ లాంటి హిందీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఐతే 2002లో ‘అగ్నివర్ష’ చేశాక నాగ్ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.
సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇప్పుడు అక్కడ ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అరగంట నిడివితో ఆయన పాత్ర ఉంటుంది. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఇంతకుముందే మీడియాకు కొన్ని విశేషాలు వెల్లడించాడు నాగ్. ఇప్పుడు తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బ్రహ్మాస్త్ర’ గురించి మరికొన్ని ముచ్చట్లు చెప్పాడు.
‘బ్రహ్మాస్త్ర’ 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో సాగే సినిమా అని నాగ్ చెప్పడం విశేషం. ఎంత పీరియడ్ మూవీ అయినా సరే.. కొన్ని వందల ఏళ్ల వెనుకటి నేపథ్యాన్ని తీసుకుంటూ ఉంటారు దర్శకులు. కానీ ఏకంగా 5 వేల ఏళ్ల కిందటి బ్యాక్ డ్రాప్ అంటే ప్రేక్షకులను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నట్లే. తనకు బేసిగ్గా మైథాలజీ జానర్ అంటే చాలా ఇష్టమని.. రామాయణం, మహాభారతం లాంటి కథలపై అమితాసక్తి ఉందని.. ఈ నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ లాంటి లార్జర్ దన్ లైఫ్ సినిమాలో నటించడానికి ముందుకొచ్చానని నాగ్ తెలిపాడు.
నిడివితో సంబంధం లేకుండా ఈ సినిమాలో తన పాత్ర కీలకంగా ఉంటుందని నాగ్ ఇంతకుముందే చెప్పాడు. ఇక రణబీర్, ఆలియాలతో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ చాలా మంచి నటులని, అలాగే ఇద్దరిలోనూ మంచి ఎనర్జీ ఉంటుందని, సెట్స్‌లో అలాంటి వ్యక్తులు ఉంటే తాను మరింత ఉత్సాహంగా పని చేస్తానని నాగ్ అన్నాడు.
This post was last modified on May 26, 2021 11:18 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…