Movie News

డబ్బులెక్కడివని సోనూ సూద్‌ను అడిగితే..


కరోనా టైంలో ఇండియాలోని సూపర్ స్టార్లందరినీ మించి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. గత ఏడాది లాక్ డౌన్ పెట్టాక అష్ట కష్టాలు పడుతున్న వలస కార్మికులను వారి గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అతను అనితర సాధ్యమైన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ టైంలో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తరించాడు సోనూ.

దేశవ్యాప్తంగా లక్షల మంది సాయం కోసం ప్రభుత్వాలను అడగడం మానేసి సోనూకు విజ్ఞప్తులు పెడుతుండటం గమనార్హం. అందులో సాధ్యమైనంత మందిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు సోనూ. మందులిస్తున్నాడు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇస్తున్నాడు. ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ కూడా ఉచితమే. ఐతే ఒక్క సోనూ ఇంతమందిని ఎలా ఆదుకోగలుగుతున్నాడు.. అతడి దగ్గర అన్ని డబ్బులెక్కడివి అనే సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి.


ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సోనూ. తాను గత ఏడాది చేసిన సేవా కార్యక్రమాలు చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారని, వారిలో చాలామంది తనను సంప్రదించారని.. తాము ఇందులో భాగస్వాములవుతామని చెప్పారని సోనూ వెల్లడించాడు. తన మీద నమ్మకంతో వాళ్లు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా సేవలో భాగస్వాములు అవుతున్నారని సోనూ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బుకు ఈ విరాళాలు కూడా చేర్చి సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ మంచి పనులన్నీ చేయగలుగుతున్నానని సోనూ వెల్లడించాడు.

తన ద్వారా సాయం పొందిన వాళ్ల స్పందన చూశాక, ఎన్నో ప్రాణాలు నిలబడ్డాక కలుగుతున్న సంతృప్తి మాటల్లో వర్ణించలేనిదని.. మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అదే స్ఫూర్తిగా నిలుస్తోందని సోనూ వెల్లడించాడు. కేవలం కరోనా బాధితుల్ని ఆదుకోవడంతో తాను ఆగిపోవట్లేదని.. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకునేందుకు భారీ ప్రణాళికలే రచించామని.. కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే 2 లక్షల మందికి ఉపాధి కల్పించామని.. లక్షల మందికి స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత చేపట్టామని సోనూ వెల్లడించాడు.

This post was last modified on May 26, 2021 8:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

26 minutes ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

29 minutes ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

37 minutes ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

1 hour ago

బాబు, రేవంత్ మ‌రో సీఎం.. ఫోటో వైర‌ల్‌

దావోస్ లో జ‌రుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ స‌మావేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాల‌కులు, వ్యాపార‌వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి…

1 hour ago

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

2 hours ago