కరోనా వైరస్ కారణంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో.. వడ్డీల భారాన్ని నెలలకు నెలలు మోయడం కంటే.. నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసుకుని వచ్చిన కాడికి లాభం చేసుకుందామని చూస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ ఉద్దేశంతోనే బాలీవుడ్‌తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నిర్మాతలు ముందుకు కదిలారు.
హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమా ‘గులాబో సితాబో’తో పాటు నవాజుద్దీన్ సిద్ధిఖి నటించిన ‘గూమ్ కేతు’ కూడా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజవుతున్నాయి. ఇక అమేజాన్ ప్రైమ్ వాళ్లు ‘గులాబో సితాబో’తో పాటుగా వివిధ భాషలకు చెందిన ఏడు సినిమాల్ని నెల రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఐతే అందులో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’ తెలుగులో కూడా రిలీజవుతున్నప్పటికీ అది పక్కా తమిళ చిత్రమే.
తెలుగు నుంచి ఇంతకుముందు ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమాను జీ5లో రిలీజ్ చేశారు. కానీ అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఆ సినిమా బాగుండి మంచి స్పందన తెచ్చుకుని ఉంటే.. టాలీవుడ్లో కదలిక వచ్చేదేమో.
దాని కంటే ముందు అమేజాన్ ప్రైమ్ వాళ్లు తెలుగులో కాస్త పేరున్న సినిమాలను కొని డైరెక్టుగా రిలీజ్ చేయాలని చూశారు. రామ్ సినిమా ‘రెడ్’, నాని మూవీ ‘వి’ ఆ జాబితాలో ఉన్నాయి. కానీ మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ చిత్రాల నిర్మాతలు అంగీకరించలేదు. తమవి థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమాలంటూ వెనక్కి తగ్గారు.
ఐతే ఇప్పుడు వేరే భాష్లలో పెద్ద సినిమాలే నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజవుతుండటం.. వాటికి మంచి డీల్స్ రావడం.. పెట్టుబడి మీద లాభాలకే సినిమాలు అమ్ముడవడంతో మన నిర్మాతల్లో కచ్చితంగా కదలిక రాకపోదు. థియేట్రికల్ రిలీజ్‌ను నమ్ముకుని నెలలకు నెలలు ఫైనాన్స్ వడ్డీలు మోస్తే కచ్చితంగా భారమవుతుంది.
థియేటర్లు తెరుచుకున్నా కూడా కెపాసిటీ తగ్గించడంతో పాటు అనేక ఆంక్షల నేపథ్యంలో రెవెన్యూ కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి పరిస్థితులు బాగు పడే వరకు ఎదురు చూడాలి. అది ఎన్ని నెలలో తెలియదు. థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాక ఓటీటీల నుంచి ఇప్పుడున్న ఆఫర్లుండవు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూడక తప్పదేమో.
This post was last modified on May 16, 2020 12:04 am
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…