‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఆ సిరీస్ మీద వివాదం ముసురుకోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. ఇందులో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్టు పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై ఓ ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాయడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కోరడంతో ఎక్కడ ఈ షోకు బ్రేక్ పడుతుందో అన్న భయాలు నెలకొన్నాయి.
జూన్ 4 నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తమ సిరీస్ ట్రైలర్ వివాదానికి దారి తీసిన నేపథ్యంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ దర్శకుడు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఒక అంచనాకు రావొద్దని కోరారు. అందరూ అనుకుంటున్నట్లు తాము ఈ సిరీస్‌ను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా రూపొందించలేదన్నారు.
“ఫ్యామిలీ మ్యాన్-2 విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకసారి మీరు ఈ షో చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రశంసిస్తారని మాకు తెలుసు. ట్రైలర్‌లో కొన్ని షాట్లు మాత్రమే చూసి కొంత మంది కథాం శం అంచనా వేస్తున్నారు. సిరీస్‌ను తప్పుగా చూస్తున్నారు. ఈ షోలో ప్రధాన తారాగణంతో పాటు మా టీంలో చాలామంది తమిళులున్నారు. మాకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల బాగా అవగాహ న ఉంది.
అలాంటపుడు వారిని బాధ పెట్టేలా షోను ఎందుకు రూపొందిస్తాం? ఈ షో రూపకల్పనలో ఎన్నో సంవత్సరాల కష్టం దాగివుంది. సీజన్-1లో ఏ విధంగా అయితే సున్నితమైన, సమతూకం ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడ్డామో అదే రీతిలో ఈ సీజన్ కోసమూ కష్టపడ్డాము. కాబట్టి షో స్ట్రీమ్ అయ్యే వరకు అందరూ ఎదురు చూసి తర్వాత ఇందులోని కంటెంట్ మీద ఒక అంచనాకు రావాల్సిందిగా కోరుతున్నాం” అని రాజ్-డీకే అన్నారు.
This post was last modified on May 24, 2021 2:01 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…