ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. మరోసారి ఈ సినిమాను వాయిదా వేయడం అనివార్యం అనే అనుకుంటున్నారంతా. చివరగా ప్రకటించిన రిలీజ్ డేట్ అక్టోబరు 13కు ఇంకో ఐదు నెల సమయం కూడా లేదు. ఇప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. కనీసం ఇంకో నెల రోజులైనా షూటింగ్ చేయాల్సి ఉందంటున్నారు. బహు భాషల్లో రిలీజ్ చేయాల్సిన ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయమే వెచ్చించాల్సి ఉంటుంది. రాజమౌళి గత సినిమా ‘బాహుబలి’తో పోలిస్తే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ పని తక్కువే కావచ్చు కానీ.. మరీ తేలిగ్గా, తక్కువ రోజుల్లో అయిపోయేదైతే కాదు. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా మరోసారి వాయిదా పడటం ఖాయమని.. 2021లో ఈ సినిమా వచ్చే అవకాశమే లేదని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
కానీ ఈ అంచనాకు భిన్నంగా ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్టోబరు 13నే తమ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. తారక్ ఏదో మాట వరసకు ఈ వ్యాఖ్య చేశాడేమో అనుకుంటే.. తాజాగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ పోస్టర్లో అక్టోబరు 13న విడుదల అంటూ ప్రకటించడంతో అందరూ అలెర్ట్ అయిపోయారు.
‘ఆర్ఆర్ఆర్’ అనుకున్న సమయానికి రాదన్న ఉద్దేశంతో దసరా సీజన్ మీద కర్చీఫ్ వేయడానికి వేరే చిత్రాల నిర్మాతలు రెడీ అవుతున్న తరుణంలో ఈ పోస్టర్ ఒకింత కలకలం రేపిందనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే సంక్రాంతికో లేదంటే వేసవివో వస్తుందన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్లు కూడా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అక్టోబరు 13 విడుదలకు ‘ఆర్ఆర్ఆర్’ టీం కట్టుబడి ఉందన్న వార్త చాలామందికి జీర్ణం కావడం లేదు.
ఐతే వాస్తవికమైన అంచనాతోనే ఇలా పోస్టర్ మీద డేట్ వేశారా.. లేక మళ్లీ డేట్ మార్చేశారనే చర్చ ఇప్పటి నుంచే వద్దన్న ఉద్దేశంతో అలా మొక్కుబడిగా డేట్ వేశారా అన్న చర్చ నడుస్తోంది. ఐతే గత ఏడాది, ఇప్పుడు దొరికిన ఖాళీలో ఇప్పటిదాకా చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఎడిటింగ్, డబ్బింగ్ చాలా వరకు పూర్తి చేశారని.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా సమాంతరంగా అవుతున్నాయని.. మిగతా సన్నివేశాలు, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలోనూ ఒక స్పష్టత ఉండటంతో అక్టోబరు 13న సినిమాను రిలీజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతోనే చిత్ర బృందం ఉందని.. ఈ దిశగా ట్రై చేసి సాధ్యం కాని పక్షంలో తర్వాత డేట్ మార్చుకుందామనే ఉద్దేశంతోన రాజమౌళి అండ్ కో ఉందని చిత్ర వర్గాల సమాచారం.
This post was last modified on May 23, 2021 12:26 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…