టాలీవుడ్ మరోసారి సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టేలా కనిపిస్తోంది. గత ఏడాది ఐదారు నెలలు షూటింగ్స్ ఆగిపోయి, ఏడెనిమిది నెలల పాటు థియేటర్లు నడవక పరిశ్రమకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. మిగతా పరిశ్రమలతో పోలిస్తే ఈ సంక్షోభం నుంచి టాలీవుడ్ త్వరగానే కోలుకుంది. షూటింగ్స్ మళ్లీ ఊపందుకున్నాయి. థియేటర్లూ కళకళలాడాయి. దీంతో ఇక చెడ్డ రోజులన్నీ వెళ్లిపోయాయని.. ఇక ఎప్పటికీ ఇలాంటి కష్టం ఉండదని అనుకున్నారు. కానీ గత నెలలో చూస్తుండగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మళ్లీ షూటింగ్స్ ఆగాయి. థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్లు మూతపడి నెల రోజులు కావస్తోంది.
ఇప్పుడిప్పుడే అవి తెరుచుకుంటాయన్న ఆశలు కనిపించడం లేదు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో షూటింగ్స్ సైతం పున:ప్రారంభం అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మళ్లీ ఎప్పుడు మునుపటి పరిస్థితులు నెలకొంటాయో తెలియట్లేదు. దసరా వరకు థియేటర్లు తెరుచుకోవని.. ఏపీలో అయితే థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నా వచ్చే సంక్రాంతి వరకు 50 శాతం ఆక్యుపెన్సీనే ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇంకో రెండు నెలల వరకు షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితీ ఉండదన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సినీ జనాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేవే.
ఐతే టాలీవుడ్ సినీ పెద్దలు, ప్రముఖుల ఆలోచన అయితే ఇలా లేదని సమాచారం. పెద్ద చిత్రాల మేకర్స్ అంచనాలు వేరుగా ఉన్నాయి. కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతుండటం పట్ల ఆశాభావంతో ఉన్నారు వాళ్లందరూ. లాక్ డౌన్ పెట్టారు కాబట్టి మున్ముందు మరింతగా తీవ్రత తగ్గుతుందని.. జూన్ నెలను కూడా వదిలేస్తే జులై తొలి వారం నుంచి షూటింగ్స్‌కు వెళ్లిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో టచ్‌లో ఉంటూ డేట్లు సర్దుబాటు చేసి కొత్త షెడ్యూళ్లు వేస్తున్నారు. ఇక థియేటర్ల విషయానికి వస్తే.. ఆగస్టులో అవి మళ్లీ మొదలవుతాయని.. ముందు 50 శాతం ఆక్యుపెన్సీనే ఉంటుందనే అంచనాతో ఉన్నారు సినీ పెద్దలు.
This post was last modified on May 22, 2021 3:11 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…