‘బాహుబలి’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎలా ఉంటుంది.. ఇద్దరిలో ఎవరు హైలైట్ అవుతారు.. అన్న చర్చ నడుస్తోంది. వేరే హీరోలైతే ఏమో కానీ.. బేసిగ్గా మెగా, నందమూరి అభిమానుల మధ్య ఉండే అనధికార వైరం, పోటీ తత్వం కారణంగా ఈ చర్చ అనివార్యం అయింది.
తారక్, చరణ్ ఎంత సఖ్యంగా ఉన్నప్పటికీ.. మెగా, నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు. తమ హీరోకు ఎలివేషన్ ఇచ్చుకుంటూ అవతలి హీరోను డీగ్రేడ్ చేయడం ఎప్పుడూ జరిగేదే. ఇక ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వచ్చినపుడు.. రామరాజు, భీమ్‌ల పాత్రలకు సంబంధించి టీజర్లు వచ్చినపుడు.. ఆపై పాత్రల ఫస్ట్ లుక్స్ రిలీజైనపుడు.. ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉన్నాయి.
ఐతే అభిమానుల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఇంతకముందు రిలీజైన టీజర్లు.. తర్వాత వచ్చిన పోస్టర్లలో రామ్ చరణే ఎక్కువ హైలైట్ అయ్యాడని కామన్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కాగా.. మే 20న తారక్ బర్త్ డే. దీంతో గత ఏడాది ముందుగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ముందు అతడి టీజర్ వదిలారు. అది చూసి అందరూ వావ్ అనుకున్నారు. మే 20న తారక్ పుట్టిన రోజు టైంకి లాక్ డౌన్ కారణంగా టీజర్ వదల్లేకపోయారు. తర్వాత అక్టోబర్లో భీమ్ టీజర్ వచ్చింది. ఐతే అది రామరాజు టీజర్‌కు అనుకరణ లాగా ఉండటంతో తారక్ ఫ్యాన్స్ కొంత మేర నిరాశ చెందారు. కామన్ ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే.
ఇక ఈ ఏడాది చరణ్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసిన పోస్టర్ చాలా వైబ్రంట్‌గా అనిపించింది. అందులో ప్రతిదీ పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ కలిగింది. పాత్రను సూచించేలా బ్యాగ్రౌండ్‌ను అగ్గితో నింపేయడం కూడా పోస్టర్ ఇంకా ఆకర్షణీయంగా కనిపించింది. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన భీమ్ ఫస్ట్ లుక్ దాని ముందు కొంచెం తక్కువగానే అనిపిస్తోంది. టీజర్ మాదిరే ఇది కూడా ముందు వచ్చిన పోస్టర్‌కు అనుకరణ లాగా ఉండటం, పాత్రకు సూచిక అయిన వాటర్ బ్యాక్ డ్రాప్‌ను తీసుకోవడంతో ఇంపాక్ట్ తగ్గినట్లే కనిపిస్తోంది. తారక్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురైనట్లే కనిపిస్తోంది.
This post was last modified on May 20, 2021 3:38 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…