Movie News

ఆ నిర్మాతను ముంచిన సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్

తమిళంలో సి.వి.కుమార్ అని ఓ మంచి నిర్మాత. పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి గొప్ప దర్శకుల్ని పరిచయం చేసింది ఇతనే. అట్టకత్తి, పిజ్జా, సూదుకవ్వుం, ఇండ్రు నేట్రు నాలై, ఇరైవి.. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అతను నిర్మించాడు. అతడి ప్రతి సినిమా ఒక ప్రయోగమే. కేవల నిర్మాత పేరు చూసి.. ఇందులో ఏదో కొత్తదనం ఉంటుంది అని తమిళ ప్రేక్షకులు వచ్చే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కుమార్‌కే చెల్లింది.

నిర్మాతగా ఎన్నో పరయోగాలు చేసిన కుమార్.. తర్వాత దర్శకుడిగా మారాడు. తన అరంగేట్రం కోసం కూడా ఓ విభిన్నమైన కథనే ఎంచుకున్నాడు. అందులో మన సందీప్ కిషన్‌ను హీరోగా పెట్టుకున్నాడు. ఆ చిత్రమే.. మాయవన్. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్. కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపుతుంది.

ఐతే ఈ సినిమాకు పరిమితికి బడ్జెట్ పెట్టిన కుమార్.. తర్వాత అనుకున్న మేర బిజినెస్ చేసుకోలేకపోయాడు. సినిమాకు మంచి రివ్యూలే వచ్చినా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమా కారణంగా అతను ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నాడు. ఒక్కసారిగా కెరీర్‌కు బ్రేక్ పడింది. తర్వాత ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తే అది సరిగా ఆడలేదు. అతను ప్రొడ్యూస్ చేస్తున్న రెండు సినిమాలు మధ్యలో ఆగాయి.

ఈ నేపథ్యంలో గత ఏడాది ఓ వేడుకలో మాట్లాడుతూ.. ‘మాయవన్’ సినిమా తనను రోడ్డు మీదికి తెచ్చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సినిమా తనను అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసిందన్నాడు. పాపం మంచి సినిమా తీసినా ఇలా కావడం విచారకరమే.

ఐతే ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే.. దీన్ని తాజాగా అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేశారు. అక్కడ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చూసిన వాళ్లందరూ సూపర్ అంటున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. ఇలా అయినా కుమార్ ప్రయత్నానికి ప్రశంసలు దక్కి, అతడికి ఆర్థికంగా కొంత ప్రయోజనం చేకూరితే మంచిదే.

This post was last modified on May 15, 2020 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

2 hours ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

9 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

10 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

10 hours ago