తన సినిమాల్లో ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ సృష్టించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది అందెవేసిన చెయ్యి. ఆ ప్రత్యేక పాత్రల కోసం ఎవ్వరూ ఊహించని నటీనటులను తీసుకొస్తూ ఉంటాడు. ‘అతడు’లో నాజర్.. ‘అత్తారింటికి దారేది’లో నదియా.. ‘అల వైకుంఠపురములో’లో మురళీ శర్మ, టబు, సుశాంత్ లాంటి ఆర్టిస్టులు చేసిన పాత్రలు అందుకు ఉదాహరణ. మహేష్ బాబుతో కొత్తగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. అందులోనూ ఒక ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేశాడట. ఆ పాత్ర కోసం అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్‌ను ఎంచుకున్నట్లు సమాచారం.
గత సినిమాలో ఇదే కుటుంబం నుంచి సుశాంత్‌కు ఛాన్స్ ఇచ్చి అతడి కెరీర్ ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ఈసారి సుమంత్‌కు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ సినిమాలో సుమంత్ చేయబోయే క్యారెక్టర్ రోల్‌కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు చెబుతున్నారు.
సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి సినిమాలతో అడపా దడపా విజయాలందుకున్నప్పటికీ.. నిలకడగా సక్సెస్‌లు సాధించలేక కెరీర్లో బాగా తడబడుతున్నాడు సుమంత్. చివరగా అతడి నుంచి వచ్చిన ‘కపటధారి’ కన్నడలో పెద్ద హిట్టయిన సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ సినిమా విడుదలైంది, వెళ్లింది కూడా జనాలకు తెలియని పరిస్థితి. మంచి నటుడిగా పేరున్నప్పటికీ సరైన సినిమాలు పడక సుమంత్ కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది.
ప్రస్తుతం అతను ‘వాల్తేరు శీను’ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వేషం మార్చుకుని కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. కానీ హీరోగా మార్కెట్ జీరో అయిపోయిన సుమంత్‌కు ఈ సినిమా ఏమేర ఉపయోగపడుతుందన్నది సందేహమే. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్-మహేష్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రంలో చేయబోయే పాత్ర అయినా అతడికి బ్రేక్ ఇచ్చి కెరీర్‌ను కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.
This post was last modified on May 16, 2021 6:50 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…