Movie News

ఆయన రాస్తాడు సరే.. ప్రభాస్ దొరకాలిగా


తెలుగులో ఒక ఛట్రంలో ఇమడని విలక్షణ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ఐతే మొదలుకుని.. అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి విభిన్నమైన చిత్రాలను అందించి తన రూటే వేరని చాటిన దర్శకుడాయన. ఐతే వీటిలో ఎక్కువగా కమర్షియల్ సక్సెస్‌లు లేకపోవడంతో ఆయన ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. కెరీర్ ఎప్పుడూ అంత ఊపులో లేకపోయింది.

కొన్నేళ్ల విరామం తర్వాత యేలేటి యువ కథానాయకుడు నితిన్‌తో ‘చెక్’ అనే సినిమా తీశాడు. రిలీజ్ ముంగిట దీనికి మంచి హైపే వచ్చింది. ఈసారి యేలేటి మ్యాజిక్ వర్కవుట్ కావడంతో పాటు కమర్షియల్‌గానూ మంచి సక్సెస్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ ‘చెక్’ ఏ రకంగానూ మెప్పించలేకపోయింది. అందులో యేలేటి మార్కు మిస్సయింది. సినిమా సరిగా ఆడలేదు. దీంతో ఆయన కెరీర్ మరింత తిరోగమనం అయ్యేలా కనిపించింది.

భవ్య క్రియేషన్స్‌లో ‘చెక్’ చేస్తుండగానే యేలేటికి మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. నిజానికి ‘చెక్’ కంటే ముందే ఈ బేనర్లో యేలేటి సినిమా చేయాల్సింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే ‘చెక్’ ఫలితంతో సంబంధం లేకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు యేలేటితో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నారు. కానీ హీరో సంగతే ఎటూ తేలలేదు. ముందు స్క్రిప్టు రెడీ చేస్తే ఆ తర్వాత హీరో సంగతి చూద్దామనుకున్నారు. ఐతే ఇప్పుడు యేలేటి కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం బయటికి వచ్చింది. ఆయన ఏకంగా ప్రభాస్‌నే టార్గెట్ చేస్తున్నాడట. అతణ్ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాస్తున్నాడట. మైత్రీ వాళ్లకు ప్రభాస్‌తోనూ ఓ కమిట్మెంట్ ఉన్న మాట వాస్తవం.

కానీ ప్రభాస్ కోసం ఎవరైనా పెద్ద డైరెక్టర్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపించారు మైత్రీ అధినేతలు. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ పేరు సైతం వినిపించింది. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు యేలేటి.. ప్రభాస్ కోసం కథ రాస్తున్నాడంటే మైత్రీ ఈ ఇద్దరికి లింకు కలుపుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే యేలేటి ఇప్పటిదాకా పెద్ద స్టార్లతో సినిమాలే తీయలేదు. నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతోనే హిట్టు కొట్టలేకపోయాడు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడితో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే అంటాడా అన్నది డౌటు. కాకపోతే యేలేటి శిష్యుడైన రాధాకృష్ణకుమార్ తొలి సినిమా ‘జిల్’తో ఫ్లాప్ ఎదుర్కొన్నప్పటికీ అవకాశం ఇచ్చిన ప్రభాస్.. అతడి గురువుకు ఓ అవకాశం ఇవ్వకపోడా అన్న వాదనా ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో?

This post was last modified on May 13, 2021 10:27 am

Share
Show comments

Recent Posts

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

35 minutes ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

52 minutes ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

3 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

5 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

7 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

8 hours ago