టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చాలా భిన్నమైన పాత్రల్లో నటించిన కథానాయిక సమంత. కెరీర్ ఆరంభంలో పెద్దగా ప్రాధాన్యం లేని కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రే చేస్తూ వచ్చింది. ఈ మధ్య తమిళంలో ఆమె ‘సూపర్ డీలక్స్’ అనే సినిమాలో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేసింది. అది ఆమె కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదే.
అంతకుముందు తమిళంలోనే ‘10 ఎన్రదుకుల్లా’ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసింది సామ్. ఐతే ఇప్పుడు ఆమె మరో సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు షాకివ్వడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా సినిమాల్లో మాత్రమే అలరించిన సామ్.. తొలిసారిగా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.
‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-1లో ప్రియమణి లీడ్ హీరోయిన్ పాత్ర చేయగా.. రెండో సీజన్లో సమంత వచ్చింది. ఇందులో ప్రియమణి ఉందో లేదో తెలియదు మరి. ఐతే సమంతది ఏం పాత్ర అయ్యుంటుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం సామ్ చేసింది ఉగ్రవాది పాత్ర అట. ఆమె పాత్ర చాలా షాకింగ్‌గా ఉంటుందని.. ముందు మామూలుగానే కనిపించే క్యారెక్టర్, తర్వాత స్వరూపం మార్చుకుంటుందని అంటున్నారు. అందమైన హీరోయిన్ టెర్రరిస్టుగా కనిపించడం అంటే అందరికీ ‘దిల్ సే’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో మనీషా కొయిరాలా ఇలాంటి పాత్రే చేసింది. ఆ తర్వాత హిందీలో ఇలాంటి క్యారెక్టర్లు చాలా కనిపించాయి
This post was last modified on May 14, 2020 6:39 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…