సమంతను అలా చూసి తట్టుకోగలరా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చాలా భిన్నమైన పాత్రల్లో నటించిన కథానాయిక సమంత. కెరీర్ ఆరంభంలో పెద్దగా ప్రాధాన్యం లేని కొన్ని గ్లామర్ క్యారెక్టర్లు చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాత్రే చేస్తూ వచ్చింది. ఈ మధ్య తమిళంలో ఆమె ‘సూపర్ డీలక్స్’ అనే సినిమాలో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేసింది. అది ఆమె కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదే.

అంతకుముందు తమిళంలోనే ‘10 ఎన్రదుకుల్లా’ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసింది సామ్. ఐతే ఇప్పుడు ఆమె మరో సెన్సేషనల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు షాకివ్వడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా సినిమాల్లో మాత్రమే అలరించిన సామ్.. తొలిసారిగా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.

‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-1లో ప్రియమణి లీడ్ హీరోయిన్ పాత్ర చేయగా.. రెండో సీజన్లో సమంత వచ్చింది. ఇందులో ప్రియమణి ఉందో లేదో తెలియదు మరి. ఐతే సమంతది ఏం పాత్ర అయ్యుంటుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం సామ్ చేసింది ఉగ్రవాది పాత్ర అట. ఆమె పాత్ర చాలా షాకింగ్‌గా ఉంటుందని.. ముందు మామూలుగానే కనిపించే క్యారెక్టర్, తర్వాత స్వరూపం మార్చుకుంటుందని అంటున్నారు. అందమైన హీరోయిన్ టెర్రరిస్టుగా కనిపించడం అంటే అందరికీ ‘దిల్ సే’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో మనీషా కొయిరాలా ఇలాంటి పాత్రే చేసింది. ఆ తర్వాత హిందీలో ఇలాంటి క్యారెక్టర్లు చాలా కనిపించాయి