Movie News

ప్రభాస్ ను గట్టిగా తగులుకున్నారందరూ..

టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు మించిన క్రేజ్ ఇంకెవ్వరికీ లేదు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే క్రేజ్ పెరుగుతున్నా కొద్దీ మనోడిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ కూడా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ టైమ్‌లో ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. దీనికి కారణం రీసెంట్‌గా టాలీవుడ్‌లో జరిగిన, జరుగుతున్న కొన్ని శుభకార్యాలు.

50 ఏళ్ల వయసులో ‘దిల్’ రాజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అలాగే లాక్‌డౌన్‌ను కూడా పట్టించుకోకుండా పెళ్లిపీటలు ఎక్కేశాడు కుర్ర హీరో నిఖిల్ సిద్ధార్థ. మరోవైపు ఇప్పటికే పెళ్లిచేసుకోవాల్సిన యంగ్ హీరో నితిన్, త్వరలో కళ్యాణ ముహుర్తాన్ని ప్రకటించబోతున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేశాడు. ఇవన్నీ కాకుండా లేటెస్ట్‌గా రానా కూడా రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ప్రేయసి మిహికా బజాజ్‌ను పరిచయం చేశాడు.

దీంతో 40 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ మరోసారి ట్రోల్స్‌కు టార్గెట్ అవుతున్నాడు. మీమ్స్ చేస్తూ ప్రభాస్ పెళ్లి గురించి జోక్స్ పేలుస్తున్నారు. నిజానికి అప్పుడెప్పుడో ‘బాహుబలి’ షూటింగ్ పూర్తిచేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు ప్రభాస్. ‘బాహుబలి’ పూర్తయ్యింది, రిలీజ్ అయ్యింది, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. మూడేళ్లు కూడా గడిచిపోయింది… అయినా మనోడి పెళ్లి మాత్రం కాలేదు. ‘స్వీటీ’ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వచ్చినా, వాటిని ఇద్దరూ కొట్టిపడేశారు. కొన్నాళ్లుగా ప్రభాస్‌ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇవిడే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

అయితే వీటిపై ‘డార్లింగ్’ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ప్రభాస్… ఈ మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లి వచ్చాడు. లాక్‌డౌన్ టైమ్‌‌ను ఇంట్లోనే గడుపుతున్న ప్రభాస్, పెళ్లి గురించి ఏదో ఓ క్లారిటీ ఇస్తే తప్ప, ఇలాంటి ట్రోల్స్ ఆగవు. లేదంటే టాలీవుడ్‌లో ఎవ్వరు పెళ్లి చేసుకున్నా, మళ్లీ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడం గ్యారెంటీ.

This post was last modified on May 14, 2020 6:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

6 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

6 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

6 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

8 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

10 hours ago