రెండు భాగాలుగా ‘పుష్ప’.. కొన్ని రోజులుగా మీడియాలో కనిపిస్తున్న వార్త ఇది. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ అని తేడా లేకుండా అన్ని మీడియాల్లోనూ ఈ వార్త హల్‌చల్ చేసింది. సోషల్ మీడియాలోనూ దీని గురించి పెద్ద చర్చ జరిగింది. ఇది జస్ట్ రూమరా.. నిజమైనా వార్తేనా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నిజమే అయితే.. అధికారికంగా ప్రకటన ఏమీ లేదే అన్న డౌట్ కొడుతోంది.
కానీ వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో సుకుమార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. ముందు ఆయన టీం నుంచే ఈ మేరకు మీడియాకు లీక్ ఇచ్చినట్లు సమాచారం. మీడియా ఎలా స్పందిస్తుంది.. ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అని చూడటానికే ఈ లీక్ ఇచ్చాడట సుక్కు. జనాల స్పందనను బట్టి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకుంటారట.
ఈ నెలాఖరుకు సుక్కు ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘బాహుబలి’ని ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో నిడివి ఎక్కువవుతోందని భావించి, ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకుని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు కొంత వ్యతిరేకత వచ్చినా.. చివరికి ఆ ప్రయోగం అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు సుక్కు ఆలోచన కూడా ఇలాగే ఉంది. ఆయన ‘పుష్ప’ కోసమని ఎంతో పరిశోధన చేశారు. బోలెడంత కంటెంట్ రెడీ చేశాడు. ఒక దశలో ‘పుష్ప’ సినిమా తీయగా మిగిలిన కంటెంట్‌తో ఓ వెబ్ సిరీస్ తీయాలని ఆయన అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు.
ఐతే ఇప్పుడు ఆయనకు రెండు భాగాలుగా సినిమా తీసే ఆలోచన వచ్చింది. ఐతే ‘బాహుబలి’ సంగతి వేరు. ‘పుష్ప’ లాంటి సోషల్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందిగ్ధత కూడా లేకపోలేదు. అందుకే తన టీంతో మరింతగా చర్చించి.. జనాల ఫీడ్ బ్యాక్ చూసుకుని.. అలాగే స్క్రిప్టు ఏమేర సపోర్ట్ చేస్తుందో చూసుకుని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నాడట సుక్కు.
This post was last modified on May 8, 2021 5:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…