నందమూరి హీరోలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కలయికలో ఒక మల్టీస్టారర్ రాబోతోందని.. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రం ‘పటాస్’ను స్వయంగా నిర్మించి నటించిన కళ్యాణ్ రామ్ మీద అనిల్‌కు ప్రత్యేక అభిమానం ఉన్న మాట వాస్తవం.
అలాగే తన ఫేవరెట్ హీరో బాలకృష్ణతో సినిమా చేయడానికి అనిల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న మాటా నిజమే. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ వార్త చాలామందికి నమ్మశక్యంగానే అనిపించింది. అన్ని మీడియాల్లోనూ దీని గురించి జోరుగా వార్తలు షికారు చేశాయి. ఐతే ఇది జస్ట్ రూమరే అని తేల్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నందమూరి హీరోల మల్టీస్టారర్ గురించి తాను కూడా మీడియాలోనే చూసి తెలుసుకున్నానని.. ఈ దిశగా తాను ఎలాంటి సన్నాహాలు చేయట్లేదని అనిల్ తేల్చేశాడు.
ఇదిలా ఉంటే.. తాను బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అని.. ఐతే ఈ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉందని.. ఏదీ ఖరారవ్వలేదని అనిల్ స్పష్టం చేశాడు. ఎప్పటికైనా బాలయ్యతో సినిమా తీస్తాననే మాటను అనిల్ ముందు నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తానే మీడియాకు చెబుతానని అనిల్ అన్నాడు.
గత నెలలో అనిల్ కరోనా బారిన పడటంతో అతను దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్-3’ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం అనిల్‌కు నెగెటివ్ వచ్చింది. అతను పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నెలంతా ‘ఎఫ్-3’ షూటింగ్ పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశముంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘ఎఫ్-2’ హీరో హీరోయిన్లు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లే కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 7, 2021 9:04 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…