గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరుతో కొన్నేళ్ల కిందట వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పోర్న్ మూవీ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ ఈ షార్ట్ మూవీ తీశాడు.
దానిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఇండియాలో పోర్న్ సినిమా తీయడం నిషేధం కావడంతో వర్మపై కేసులు నమోదయ్యాయి. ఐతే మియా అసలు ఇండియాకు రాలేదని.. తాను ఇక్కడి నుంచే ఆన్ లైన్ ద్వారా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశానని.. ఇంకా ఏవో వివరణలు ఇచ్చి ఈ కేసు నుంచి వర్మ బయటపడే ప్రయత్నం చేశాడు. ఇంతకీ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. ఐతే అప్పటి అనుభవాల నేపథ్యంలో వర్మ మళ్లీ మియా జోలికి వెళ్లడని అంతా అనుకున్నారు.
కానీ ఆర్జీవీ మళ్లీ ఈ పోర్న్ స్టార్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఆ సినిమా పేరు క్లైమాక్స్ అట. కరోనా వైరస్ నేపథ్యంలో తీసిన సినిమా ఇదని వర్మ సంకేతాలు ఇచ్చాడు. కరోనా శాపంతో.. లాక్ డౌన్ ఆశీస్సులతో తాను ఈ సినిమా తీశానంటూ తనదైన శైలిలో ఓ ట్వీట్ వేశాడు వర్మ. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ క్లైమాక్స్ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వర్మ ప్రకటించాడు.
ఇదొక థ్రిల్లర్ మూవీ అంటూ జానర్ కూడా వర్మ వెల్లడించాడు. ఇందులో తనదైన నటనతో మియా మాల్కోవా అందరినీ ఆశ్చర్యపరుస్తుందన్నాడు. మియాతో ఉన్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశాడు. ఐతే అది కొత్తదో పాతదో తెలియదు. బహుశా లాక్ డౌన్ టైంలో వర్మ ఇక్కడే ఉండి తన ఐడియా ఏదో మియాకు చెప్పి ఆన్ లైన్‌లో సూచనలు చేస్తూ షార్ట్ ఫిలిం లాంటిదేదో చిత్రీకరించి ఉంటాడని భావిస్తున్నారు.
This post was last modified on May 14, 2020 2:17 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…