Dil Raju
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అనేక దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా.. ఆస్ట్రేలియా, పలు దేశాలు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా అమెరికా విధించిన ట్రావెల్ బ్యాన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రావల్ బ్యాన్‌ను విధించారు. దాంతో అమెరికా వెళ్లాల్సిన వారు ఎలర్ట్ అయ్యారు.
సీనియర్ నిర్మాత దిల్ రాజు తన పర్శనల్ పనిమీద అమెరికా వెళ్లాలి. ఈ ట్రావెల్ బ్యాన్ తో ఇబ్బంది అవుతుందని, ఆయన నిన్ననే అమెరికా వెళ్లిపోయారు. తోడుగా ఆయన భార్య కూడా ఉన్నట్లు సమాచారం. ఇక దిల్ రాజు ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకున్నారు. ‘వకీల్ సాబ్’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు.
లాస్ట్ ఇయిర్ కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకు ఇండస్ట్రీలో కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో నిర్మాత దిల్ రాజు దూకుడు పెంచారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పట్టాలెక్కించారు. ఈరోజు ఏకంగా 5 సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఆయనకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు సినిమాల్లో, ‘ఎఫ్3’, ‘థాంక్యూ’, ‘పాగల్’, ‘హుషారు’ చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి కరోనా సెకండ్ వేవ్ తో అన్ని బ్రేక్ పడ్డాయి.
This post was last modified on May 5, 2021 10:57 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…