త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే.. రైటింగ్ క్రెడిట్ పూర్తిగా ఆయనకే వెళ్లిపోతుంటుంది. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్ అనే చూస్తుంటాం. రచనా సహకారం అంటూ కూడా పేర్లు కనిపించడం అరుదు. ఆయన ఎవరి నుంచి రచనా సహకారం తీసుకోరా.. లేక తీసుకున్నా ఎవరికీ క్రెడిట్ ఇవ్వడా అన్నది తెలియదు మరి.
త్రివిక్రమ్ రైటింగ్ టీంలో ఎవరుంటారో కూడా పెద్దగా పేర్లు బయటికి రావు. ఆయన శిష్యులుగా ఇండస్ట్రీలో చలామణి అయిన వాళ్లు కూడా తక్కువే. ఆ కొద్ది మందిలో వెంకీ కుడుముల ఒకడు. త్రివిక్రమ్ బ్రాండుతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. వరుసగా రెండు విజయాలందుకున్నాడతను. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు సంపాదించి.. హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడతను. ‘ఉప్పెన’తో హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా అతనో సినిమా రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే దర్శకుడిగా మూడో సినిమా పనులు చూసుకుంటూనే.. తన గురువు కోసం వెంకీ పని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. దీని తర్వాత మహేష్ బాబుతో పని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో వెంకీ పని చేయబోతున్నాడట. దర్శకుడిగా మారి మంచి పేరు సంపాదించాక ఇలా తిరిగి రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో పని చేయడం అరుదుగా జరుగుతుంటుంది.
ఐతే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. త్రివిక్రమ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు కూడా. మహేష్‌తో ఇంకతుముందు తీసిన రెండు సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్లుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి బ్లాక్‌బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడు మాటల మాంత్రికుడు. ఈ నేపథ్యంలోనే శిష్యుడి సాయం తీసుకుంటున్నాడట. వెంకీ మీద మహేష్‌కు కూడా మంచి గురి ఉంది. అతడితో మహేష్ కథా చర్చలు కూడా జరిపాడు. మహేష్ నిర్మాణంలో వెంకీ ఓ సినిమానో, వెబ్ సిరీసో తీయబోతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి వెంకీ రచనా సహకారం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
This post was last modified on May 5, 2021 8:02 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…