తమన్.. తమన్.. తమన్.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇదే పేరు మార్మోగుతోంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అతను చేసిన ప్రతి సినిమా ఆడియో సూపర్ హిట్టవుతుండటం.. ఆయా చిత్రాలకు తమన్ సంగీతం పెద్ద ప్లస్ అవుతుండటంతో తన క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తమన్ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఈ ఏడాది ‘వకీల్ సాబ్’తో తమన్ ఒక ఊపు ఊపేస్తున్నాడు.
ఈ సినిమా పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వెండితెరపై సినిమా చూస్తున్నపుడు పాటలు.. నేపథ్య సంగీతం మరింత ప్రభావవంతంగా కనిపించాయి. ఈ సినిమాకు తెర ముందు హీరో పవన్ కళ్యాణ్ అయితే.. తెర వెనుక తమనే హీరో అని పొగిడేస్తున్నారందరూ. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ చూస్తున్న వాళ్లు మరింతగా తమన్ సంగీతానికి కనెక్ట్ అవుతున్నారు. మొన్న సినిమా ఆన్‌లైన్లో రిలీజైనప్పటి నుంచి తమనే హాట్ టాపిక్.
తమన్ ఆడియోలు, నేపథ్య సంగీతం వల్ల సినిమాలకు మంచి మైలేజ్ వస్తుండటంతో స్టార్లందరూ మొహమాటం లేకుండా అతడికే ఓటేస్తున్నారు. కొత్తగా ఏ పెద్ద సినిమాకు రంగం సిద్ధమైనా.. సంగీత దర్శకుడిగా తమన్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ‘వకీల్ సాబ్’లో తమన్ పనితనానికి ఇంప్రెస్ అయిన పవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ కోసం కూడా అతణ్నే ఎంచుకున్నాడు. మరోవైపు మహేష్ బాబు.. వరుసగా రెండు చిత్రాలకు తమన్‌ను ఓకే చేశాడు. సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్‌తో మహేష్ చేయబోయే చిత్రానికీ తమనే మ్యూజిక్ డైరెక్టర్.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు ఇంకా సంగీత దర్శకుడు ఖరారవ్వలేదు కానీ.. కొరటాల సైతం తొలిసారి తమన్‌తో పని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో రాబోయే చిత్రానికీ తమనే సంగీత దర్శకుడు. ఇవి కాక తమన్ సంగీతాన్నందించిన టక్ జగదీష్, అఖండ లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అఖిల్-సురేందర్ రెడ్డిల క్రేజీ మూవీ ‘ఏజెంట్’ సైతం తమన్ ఖాతాలోనిదే. బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమాకు సైతం తమనే సంగీతం సమకూర్చబోతున్నట్లు సమాచారం. మొత్తం ఇండియాలోనే ఇన్ని క్రేజీ ప్రాజెక్టులతో, ఇంత బిజీగా ఉన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ లేడంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on May 3, 2021 2:56 pm
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…