పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి హీరోయిన్లు ఎగబడటం కామన్. కానీ ఆయనతో సినిమా ఓకే అయ్యాక అందులో నటించలేనంటూ ఓ హీరోయిన్ తప్పుకోవడం ఈ మధ్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కథానాయిక మరెవరో కాదు.. సాయిపల్లవి. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌లో పవన్‌కు జోడీగా ముందు సాయిపల్లవి ఎంపిక కావడం, కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆమె తప్పుకోవడం తెలిసిన సంగతే.
మలయాళంలో గౌరి నంద అనే అమ్మాయి చేసిన పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. గిరిజనురాలైన నక్సలైట్ పాత్ర తనది. ఇళాంటి పాత్రను ఎవరు పడితే వాళ్లు చేయలేరు. మంచి నటి అయి ఉండాలి. నిడివి తక్కువే అయినా పేరున్న నటినే ఈ పాత్ర కోసం తీసుకోవాల్సి ఉండటంతో ఆర్టిస్టును ఖరారు చేయడంలో ఆలస్యం జరిగింది. ఐతే ఎట్టకేలకు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
సాయిపల్లవి కంటే ముందు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన మరో మలయాళ నటి నిత్యా మీనన్‌ను ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్‌కు జోడీగా ఖాయం చేసినట్లు తాజా సమాచారం. పాత్ర నచ్చి ఇందులో నటించడానికి నిత్య ఓకే చెప్పిందట. ఆమె ఈ పాత్రకు మంచి ఛాయిస్ అనే అంటున్నారు. పవన్‌కు కరోనా సోకడం, వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉండటంతో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ షూటింగ్‌ను కొన్ని వారాల నుంచి ఆపేసి ఉన్నారు.
పవన్‌తో దగ్గరగా మెలిగిన దర్శకుడు సాగర్ చంద్ర ఐసొలేట్ కావడం తెలిసిందే. మళ్లీ ఎప్పుడు అందరికీ కుదిరితే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. మధ్యలో దొరికిన ఖాళీలోనే నిత్యా మీనన్‌ను ముఖ్య పాత్ర కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది
This post was last modified on May 2, 2021 5:47 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…