పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘వకీల్ సాబ్’ చిత్రం అమేజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ‘వవకీల్ సాబ్’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టారు పవన్. హిందీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేసి విజయం సాధించారు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.
ఏప్రిల్ 30నుంచి ఓటీటిలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా అప్పుడే పైరసీకు గురై ఒరిజనల్ వెర్షన్ నెట్ లో దొరకటం విషాదం. ఇది నిర్మాతకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కానీ ఒరిజనల్ వెర్షన్ బయిటకు వచ్చేయటంతో డౌన్ లోడ్ చేసుకుని చూసేవారు చూసేస్తారు. దాంతో ఓటీటికు వ్యూస్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఓటీటి సంస్దలు ఈ పైరసీని ఆపే ప్రయత్నం చేయటం లేదు.
నిజానికి ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్ సమయంలోనే రెండు వారాల తర్వాత అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ రూమర్స్ ఖండించారు. 50 రోజుల తర్వాత ఈ సినిమాను అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తామని ఆలోపు చేయమని చెప్పారు. తీరా కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను అనుకున్న దాని కంటే నెల ముందే అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేశారు.
థియేటర్లు మూతపడిన నేపథ్యంలో దిల్ రాజు మనస్సు మార్చుకొని సినిమా విడుదలైన 21 రోజుల తర్వాత ఈ సినిమాను అమెజాన్‌లో విడుదల చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే అలా చేసినందుకు గాను దిల్ రాజుకు కొత్త చిక్కులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌కు 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అంటూ అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు. కానీ మూడు వారాల తర్వాత విడుదల చేయడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. మూడు కోట్లు వెనక్కి కట్టమని అడుగుతున్నారట. కరోనా ఓ ప్రక్క, పైరసీ మరోప్రక్క ‘వకీల్ సాబ్’ ని ఇబ్బంది పెడుతున్నాయి.
This post was last modified on April 30, 2021 11:42 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…