సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక వీడియో చూసి కదిలిపోయాడు. అతను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ వీడియో చూస్తే ఎవ్వరికైనా హృదయం ద్రవిస్తుందనడంలో సందేహం లేదు. ఆ వీడియో తీసింది ఎక్కడ అన్న వివరాలు లేవు కానీ.. కరోనా వేళ ఆదరవు లేని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి సదరు వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడులోనిదిగా భావిస్తున్న ఆ వీడియోలో ఏం ఉందంటే..?
ఒక అనాథ వృద్ధురాలు రోడ్డు పక్కన కూర్చుని ఉండగా.. ఎవరో తీసుకెళ్లి నీళ్ల బాటిల్, ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు. వాటిని ఎంతో ఆశగా ఆ వృద్ధురాలు తీసుకోవడం.. ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం విల్లివిరియడం.. చేతులెత్తి మొక్కడం కనిపించింది. ఇక వీడియోలో ఆఖరి దృశ్యం మరింత భావోద్వేగానికి గురి చేసేదే. తనకు ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్, నీళ్ల బాటిల్‌కు డబ్బులివ్వాలేమో అనుకుని తన చీర కొంగులో దాచుకున్న చిన్న మొత్తం ఇవ్వబోయింది. వద్దంటే సరే అని దాచుకుంది. కరోనా వేళ అనాథలైన వృద్ధుల దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన తమన్.. ఇది చూశాక వృద్ధాశ్రమం నిర్మించాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
“వీడియో చూసి నా హృదయం ముక్కలైంది. ఓ వద్ధాశ్రమాన్ని నిర్మించాలనే ఆలోచన వెంటనే మొదలైంది. త్వరలోనే ఆ పనులు మొదలుపెడతాను. నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో పాటు బలాన్ని అందిస్తాడని భావిస్తున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆహారాన్ని వృథా చేయకండి. అవసరంలో ఉన్నవారికి ఆహారాన్ని అందించండి. మనుషుల్లాగా ఉండండి” అని తమన్ పేర్కొన్నాడు. తమన్ షేర్ చేసిన వీడియో ఎంతోమందిని కదిలించింది. భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు. తమన్ ఆలోచనను అభినందించారు.
This post was last modified on April 26, 2021 10:28 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…