నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తున్నారు. తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అఖండ తర్వాత బాలయ్య చిత్రాల లైనప్ ఆసక్తిగా మారుతోంది.
ఇటీవల కాలంలో బాలయ్యకు బోయపాటి మినహా ఇతర దర్శకులు సరైన హిట్ అందించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా బాలయ్యని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ప్రజెంట్ చేయడంలో దర్శకులు విఫలమయ్యారు. కానీ బోయపాటితో మాత్రం బాలయ్యకు సింక్ కుదిరింది. అందుకే వీరి కాంబోలో విజయాలు వస్తున్నాయి.
ఇతర దర్శకులు కూడా ఇప్పటి ట్రెండ్ కు తగ్గ కథలో బాలయ్యని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించినప్పటికీ కథ అవుట్ డేటెడ్ అయితే ఆడియన్స్ రిజెక్ట్ చేసేస్తారు. ఇకపై ఆ నిరాశ బాలయ్య అభిమానులకు ఉండకపోవచ్చు.
అఖండ తర్వాత బాలయ్య ఇద్దరు క్రేజీ కుర్ర దర్శకుల దర్శత్వంలో నటించబోతున్నారు. క్రాక్ తో ఘనవిజయం సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని, వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి లతో బాలయ్య చిత్రాలు ఖరారైనట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అనిల్ రావిపూడి కూడా ఇటీవలే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీరిద్దరి కాంబోలో చిత్రానికి బాలయ్య పుట్టిన రోజున అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ తో మరో చిత్రం చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగడంతో అనిల్ బాలయ్యని లైన్ లో పెట్టాడు.
This post was last modified on %s = human-readable time difference 11:20 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…