తెలుగు హీరోలు, నిర్మాతల దృష్టి ఉన్నట్లుండి మలయాళ సినిమాలపై పడింది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనువాదమై తెలుగులో రిలీజ్ అయినా సరే.. రామ్ చరణ్ రీమేక్ హక్కులు కొని ఆశ్చర్యపరిచాడు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ కథకు తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కొచ్చు.
మరోవైపు పృథ్వీరాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత వంశీ రీమేక్ హక్కులు కొని దీని కోసం ఇద్దరు హీరోలను వెతికే పనిలో పడ్డాడు. మరోవైపు స్క్రిప్టు వర్క్ కూడా నడుస్తోంది. ఆ చిత్రాని హీరోలంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి కానీ.. ఏవీ ఖరారరవ్వలేదు.
ఈలోపు మరో మలయాళ రీమేక్ తెరపైకి వచ్చింది. పృథ్వీరాజే హీరోగా నటించిన ఆ సినిమా పేరు.. డ్రైవింగ్ లైసెన్స్. ఈ సినిమా రీమేక్ హక్కులు ఓ ప్రముఖ నిర్మాత కొన్నాడని.. పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమో తెలియదు. ఐతే ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ గురించి రెండు నెల ముందే వార్తలొచ్చాయి. కాబట్టి నిజంగానే రీమేక్ హక్కులు ఎవరైనా కొని ఉండొచ్చు.
మలయాళంలో క్లాస్‌గా, పెద్దగా హంగామా లేకుండా సాగిపోయే ఈ చిత్రాన్ని తెలుగులో తీస్తే కొంచెం హంగామా జోడించాల్సిందే. దీని కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సూపర్ స్టార్ హీరో ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఐతే ఆ సమయానికి అతడి లైసెన్స్ కనిపించదు. కొత్తగా లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేయగా.. దాని వల్ల రసాభాస జరుగుతుంది. తనను ఆరాధించే ఆర్టీవో అధికారితోనే ఈ హీరోకు గొడవ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా నడుస్తుంది. ఐతే ఈ సినిమాలో ఎవరు చేసినా.. ఆ హీరోకు సూపర్ స్టార్ ఇమేజ్ ఉండాలి. పవన్ అనే కాదు.. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల్లో ఎవరు చేసినా బాగుంటుంది. మరి ఎవరు సై అంటారో చూడాలి.
This post was last modified on May 14, 2020 2:40 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…