Movie News

సల్మాన్ తెలుగు ప్రేమ

దక్షిణాదిన ఏ భాషలో సినిమా హిట్టయినా బాలీవుడ్ వాళ్ల కళ్లు పడిపోతుంటాయి. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కథలు హిందీలోకి వెళ్తుంటాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్టలైన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ తీసే సినిమాలపై బాలీవుడ్ వాళ్లు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. కేవలం సినిమాలను రీమేక్ చేయడమే కాదు.. ఇక్కడి సన్నివేశాలు, పాటలు, డైలాగుల నుంచి స్ఫూర్తి పొందడం ఎన్నో సినిమాల్లో గమనించవచ్చు.

ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు తెలుగు సినిమాలంటే మహా ప్రీతి. ఒక దశలో బాగా దెబ్బ తిన్న ఆయన కెరీర్‌ను గాడిన పెట్టుకున్నదే ‘పోకిరి’ రీమేక్ ద్వారా. ఇక అప్పట్నుంచి తెలుగు సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అవుతూనే ఉన్నాడు సల్మాన్. రెడీ, కిక్, స్టాలిన్.. ఇలా సల్మాన్ తెలుగు నుంచి ముచ్చటపడి రీమేక్ చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ నుంచి వస్తున్న ‘రాధె’ ఏ తెలుగు సినిమాకూ రీమేక్ కాదు కానీ.. దాని ట్రైలర్ చూస్తుంటే మాత్రం అచ్చంగా తెలుగు సినిమా చూసినట్లే కనిపిస్తోంది.

‘పోకిరి’ సినిమాకు సీక్వెలా అన్నట్లుగా ఉంది ‘రాధె’ సినిమా. ఇందులో సల్మాన్ పోలీసుల కోసం పని చేసే ఏజెంట్ తరహా పాత్రలో నటించాడు. ‘‘ఒకసారి కమిట్మెంట్ తీసుకుంటే నా మాట నేనే వినను’’ అంటూ ‘పోకిరి’ సినిమాను గుర్తు చేసే డైలాగ్ పేల్చాడు సల్మాన్ ఇందులో. కొంత వరకు సల్మాన్ పాత్రలో ‘ఏక్ నిరంజన్’లో హీరో ఛాయలు కనిపించాయి. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగులు పూరి జగన్నాథ్ సినిమాలను తలపిస్తున్నాయి.

మరోవైపు అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్ ‘సీటీమార్’ ట్యూన్‌ను ఈ సినిమాలో వాడేయడం విశేషం. ఇంతకుముందు కూడా బన్నీ సినిమాలోని ఓ పాటను సల్మాన్ వాడుకున్నాడు. ‘రింగ రింగ’ పాటను ‘రెడీ’ రీమేక్‌లో ఉపయోగించారు. ఆ పాట సూపర్ హిట్టయింది. ఇప్పుడు మళ్లీ బన్నీ పాటను సల్మాన్ వాడుకోవడం స్టైలిష్ స్టార్ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. మొత్తంగా చూస్తే ‘రాధె’ సినిమాలో తెలుగు టచ్ బాగా కనిపిస్తుండటంతో మన అభిమానులు ట్రైలర్‌కు బాగా కనెక్టవుతున్నారు.

This post was last modified on April 22, 2021 2:45 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

48 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

54 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

3 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

3 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

9 hours ago