వేసవి సినిమా సందడిపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది కరోనా మహమ్మారి. గత ఏడాది ఇదే సమయానికి కరోనా జనాలను ఎంతగా కుంగదీసిందో తెలిసిందే. తర్వాత పరిస్థితులు మెరుగు పడ్డాయి. నార్మల్సీ వచ్చేసిందనే అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ విజృంభణతో మళ్లీ కష్టాలు తప్పట్లేదు. సినీ పరిశ్రమ మీద సెకండ్ వేవ్ గట్టి ప్రభావమే చూపేలా ఉంది. వరుసగా కొత్త సినిమాలు వాయిదా పడుతున్నాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. సినిమా వాళ్లందరూ ఇంటికి పరిమితం కాక తప్పేలా లేదు.
ఈ సమయంలో ఇక గత ఏడాది లాగే ఈసారి కూడా కొంత కాలం పాటు సినీ ప్రియులను ఎంగేజ్ చేయడానికి సందర్భోచిత అప్‌డేట్స్ మినహా ఇంకే ఆనందాలు మిగిలేలా లేవు. యంగ్ రెబల్ స్టార్ ఈ వేసవిలో తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొనాల్సింది.
ముఖ్యంగా ఈ వేసవిలో మేజర్ డేట్స్ ‘ఆదిపురుష్’కు ఇచ్చాడు ప్రభాస్. ఆ సినిమా కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కరోనా పుణ్యమా అని ఆ ప్రణాళికలు దెబ్బ తిన్నాయి. షూటింగ్ ఆపేసి కూర్చుంది టీమ్. ఐతే ఈ ఖాళీ సమయంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి సిద్ధమయ్యాడు దర్శకుడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ నుంచి ఒక అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు అతను వెల్లడించాడు.
ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ఉదయం 7.11 నిమిషాలకే ప్రతి అప్‌డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒరవడిని కొనసాగిస్తూ బుధవారం ఉదయం 7.11కు అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు ఓం రౌత్ వెల్లడించాడు. బహుశా బుధవారం శ్రీరామ నవమి కానుగా ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారేమో. రౌత్ ఇలా ‘ఆదిపురుష్’ గురించి ట్వీట్ వేశాడో లేదో.. ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయిపోవడాన్ని బట్టి ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 20, 2021 5:27 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…