Movie News

కేన్ మామ రావాల్సిందే

ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణించే జట్లలో సన్‌రైజర్స్ ఒకటి. 2012లో లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్ నుంచి ఆ జట్టు చక్కటి ప్రదర్శనే చేస్తోంది. 2016లో టైటిల్ కూడా గెలిచింది. యూఏఈలో జరిగిన గత సీజన్లోనూ సన్‌రైజర్స్ ఆకట్టుకుంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మొత్తంగా మూడో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా హైదరాబాద్ జట్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. లీగ్ దశలో మంచి ప్రదర్శన చేయడం, ప్లేఆఫ్స్ చేరడం లాంఛనమే అని.. ఐతే తమకు టైటిల్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జట్టు బలంగా ఉండటంతో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగానే సన్‌రైజర్స్‌ను భావించారందరూ. కానీ టోర్నీ ఆరంభమయ్యాక చూస్తే సన్‌రైజర్స్ అంచనాలను అందుకోలేకపోతోంది. టోర్నీలో ప్రతి జట్టూ కనీసం ఒక్క విజయం అయినా సాధించగా.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ ఓడిపోయింది. మూడు మ్యాచుల్లోనూ గెలిచే స్థితి నుంచి కుప్పకూలి పరాజయం పాలవడం అభిమానులకు రుచించడం లేదు.

సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ ఆటతీరు మీద ఎన్నో విమర్శలు. మీమ్స్ అయితే కోకొల్లలు. సొంత అభిమానులే ఆ జట్టు మీద బోలెడన్ని మీమ్స్ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టంతా కేన్ విలియమ్సన్ మీదే ఉంది. ఈ న్యూజిలాండ్ ఆటగాడంటే భారత అభిమానులకు కూడా చాలా ఇష్టం. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అయితే చెప్పాల్సిన పని లేదు. మైదానంలో ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ.. చక్కటి ప్రదర్శన చేసే కేన్ అందరికీ నచ్చుతాడు. హైదరాబాద్ ఫ్యాన్స్ అతణ్ని సోషల్ మీడియాలో ప్రేమగా ‘కేన్ మామ’ అని పిలుస్తుంటారు.

తొలి మూడు మ్యూచుల్లో విలియమ్సన్ లేకపోవడం వల్లే మిడిలార్డర్ అలా కుప్పకూలి ఓటమి చవిచూడాల్సి వచ్చిందని.. అతణ్ని జట్టులోకి తేవాల్సిందే అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మూడో ఓటమి తర్వాత అయితే మీమ్స్ అన్నింట్లోనూ కేన్ కనిపిస్తున్నాడు. అనేక హీరోయిక్ సినిమా క్యారెక్టర్లలో విలియమ్సన్‌ను చూపిస్తూ.. అతనొచ్చి జట్టును రక్షించాలని పేర్కొంటున్నారు. సరదాగానే ఉన్నప్పటికీ సన్‌రైజర్స్ అభిమాలను డెస్పరేషన్‌ను ఈ మీమ్స్ చూపిస్తున్నాయి. ఫిట్నెస్ సమస్యల వల్లే కేన్ ఇప్పటిదాకా మ్యాచ్ ఆడలేదని అంటున్నారు. తర్వాతి మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నారు.

This post was last modified on April 18, 2021 5:23 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

57 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago