రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సూపర్ హిట్. రెండో సినిమా ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్. ఆ సినిమాతో చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడి మూడో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో అప్పటికే తనకు వచ్చిన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నాడు చరణ్. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాలతో మంచి పేరు సంపాదించిన భాస్కర్ అతణ్ని అప్రోచ్ అయ్యాడు.
క్రేజీగా అనిపించిన ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి చరణ్ బాబాయి నాగబాబు ముందుకొచ్చాడు. ఘన చరిత్ర ఉన్న అంజనా ప్రొడక్షన్స్ బేనర్ మీద సినిమా మొదలుపెట్టాడు. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. హ్యారిస్ జైరాజ్ పాటలు మార్మోగిపోయాయి. సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. కానీ థియేటర్లకు వెళ్లిన జనాలకు మాత్రం నీరసం వచ్చేసింది. కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టడంతో ‘ఆరెంజ్’ ప్రేక్షకులకు రుచించలేదు. చరణ్ శ్రమ నిష్ఫలమైంది.
చరణ్ అప్పుడున్న ఊపులో ఇది మాస్ సినిమా అయితే ఓపెనింగ్స్‌తోనే చాలా వరకు పెట్టుబడి వెనక్కి వచ్చేసేది. కానీ క్లాస్ లవ్ స్టోరీ కావడంతో రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. దెబ్బకు నాగబాబు రోడ్డు మీదికి వచ్చేసే పరిస్థితి. ఈ సినిమా వల్ల తలెత్తిన నష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లు నాగబాబు తర్వాతి రోజుల్లో చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఐతే తర్వాత అన్నయ్య, తమ్ముడు ఆదుకోవడం.. తాను కూడా టీవీ రంగంలోకి వెళ్లి సీరియళ్లు, షోలు చేయడం ద్వారా నిలదొక్కుకోవడం.. సమయానికి కొడుకు వరుణ్ తేజ్ కూడా చేతికి అందిరావడంతో నాగబాబు బాగానే పుంజుకున్నారు. ఇప్పుడీ కథంతా గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే.. తాజాగా అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ‘ఆరెంజ్’ గురించి నాగబాబు మాట్లాడారు. ఆ సినిమాకు సంబంధించి చరణ్‌కు పారితోషకం ఇచ్చారా అని అడిగితే.. ఇవ్వలేదని చెప్పాడు నాగబాబు. ఆ సమయంలో తన అప్పుల్లో సగం అన్నయ్య తీర్చాడని.. తమ్ముడు కళ్యాన్ కూడా ఆదుకున్నాడని.. చరణ్‌కు పెండింగ్ పడ్డ రెమ్యూనరేషన్‌ను భవిష్యత్తులో కచ్చితంగా ఇస్తానని నాగబాబు పేర్కొనడం విశేషం.
This post was last modified on April 17, 2021 2:13 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…